ఫైజర్ వ్యాక్సిన్ రెడీ ! భారత ప్రభుత్వానికి సిగ్నల్ పంపిన కంపెనీ, 12 ఏళ్ళు పైబడినవారంతా వాడవచ్చునట ! అయితే.. కొన్ని షరతులే అడ్డం !

తమ ఫైజర్ వ్యాక్సిన్ ఇండియాలో త్వరలో అందుబాటులోకి వచ్చే సూచనలున్నాయని ఈ సంస్థ తెలిపింది. అత్యంత నాణ్యమైన ఈ టీకామందును అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని

ఫైజర్ వ్యాక్సిన్ రెడీ ! భారత ప్రభుత్వానికి సిగ్నల్ పంపిన కంపెనీ, 12 ఏళ్ళు పైబడినవారంతా వాడవచ్చునట ! అయితే.. కొన్ని షరతులే అడ్డం !
Pfizer Vaccine
Umakanth Rao

| Edited By: Phani CH

May 27, 2021 | 9:51 AM

తమ ఫైజర్ వ్యాక్సిన్ ఇండియాలో త్వరలో అందుబాటులోకి వచ్చే సూచనలున్నాయని ఈ సంస్థ తెలిపింది. అత్యంత నాణ్యమైన ఈ టీకామందును అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని, 12 ఏళ్ళు దాటిన ప్రతి వ్యక్తీ ఈ వ్యాక్సిన్ ని వాడవచ్చునని పేర్కొంది. 2-8 డిగ్రీల సెల్సియస్ మధ్య దీన్ని నెల రోజులపాటు నిల్వ ఉంచవచ్చునని ఈ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. జులై–అక్టోబర్ మధ్య కాలంలో 5 కోట్ల డోసుల వ్యాక్సిన్ ని ఇండియాకు పంపే అవకాశాలు ఉన్నాయని వారు చెప్పారు. అయితే ఐడెంటిఫికేషన్ సహా ఇతర రెగ్యులేటరీ సడలింపులను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ఇటీవల కొన్నివారాలుగా భారత అధికారులకు, ఈ సంస్థ ప్రతినిధులకు మధ్య సమావేశాలు, చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలో ఈ సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా కూడా పాల్గొన్నారు. అత్యవసర వినియోగానికి తమ వ్యాక్సిన్ ను ఇండియాకు అందజేయాలంటే సత్వర ఆమోదాలు తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. ఇండియాలోను, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదివరకటి మాదిరి పరిస్థితి సజావుగా లేదని, అందువల్ల కోవిద్ నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రూవల్ సహా అధికారికంగా తమకు 44 అనుమతులు రావాల్సి ఉందని, కానీ పోస్ట్ అప్రూవల్ కమిటీ పర్మిషన్ అవసరం లేదని ఆల్బర్ట్ పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో ఫైజర్ వ్యాక్సిన్ ని వినియోగిస్తున్నారు.

చవకైనదైన ఈ టీకామందును ఫ్రిజ్ లో నెల రోజుల పాటు 2-8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచవచ్చునని ఇదివరకే వార్తలు వచ్చాయి. వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతున్న ఇండియాకు ఈ టీకామందు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని కోట్లాది మంది ఎదురు చుస్తునారు.

మరిన్ని ఇక్కడ చూడండి: సత్యమేవ జయతే.. ఆనందయ్యది దివ్యౌషధమా? జనం అమాయకత్వమా?

June Month Rules: జూన్‌ 1 నుంచి అందుబాటులోకి రానున్న కొత్త నిబంధనలు.. కస్టమర్ల తప్పకుండా గనించాలి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu