Religious Freedom bill 2021: విపక్షాల ఆందోళన మధ్య మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం

మతమార్పిడి నిరోధక బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది. కాంగ్రెస్‌, జనతాదళ్(S) ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఈ బిల్లు అమానవీయమని, రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు విమర్శించాయి. అయితే బీజేపీ ప్రభుత్వం ఈ వాదనలను తోసిపుచ్చింది.

Religious Freedom bill 2021: విపక్షాల ఆందోళన మధ్య మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం
Karnataka Assembly
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 23, 2021 | 9:38 PM

Karnataka Anti Conversion Bill-2021: మతమార్పిడి నిరోధక బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది. కాంగ్రెస్‌, జనతాదళ్(S) ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఈ బిల్లు అమానవీయమని, రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు విమర్శించాయి. అయితే బీజేపీ ప్రభుత్వం ఈ వాదనలను తోసిపుచ్చింది.

కర్ణాటక అసెంబ్లీలో విపక్షాల పెద్దఎత్తున ఆందోళనల మధ్య మతస్వేచ్ఛ రక్షణ బిల్లు, 2021 గురువారం ఆమోదం పొందింది. మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించిన సందర్భంగా కర్ణాటక మంత్రి డాక్టర్ అశ్వత్నారయన్ మాట్లాడుతూ, ఇది ఎంతో మంది ఎదురుచూస్తున్న బిల్లు అని అన్నారు. ఇది పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. ఇది ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించేందుకు ముందుకు సాగే బిల్లు. అలాగే సమాజంలో సామరస్యాన్ని నెలకొల్పుతుందని ఆయన అన్నారు.

అంతకుముందు, కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లు, 2021పై చర్చలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఈ బిల్లుకు సిద్ధరామయ్య నేతృత్వంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీజేపీ ఆరోపించింది. బీజేపీ తన వాదనకు మద్దతుగా, కొన్ని పత్రాలను సభ టేబుల్‌పై ఉంచింది. దీంతో కాంగ్రెస్‌ డైలమాలో పడిపోయింది. అయితే, అధికార పార్టీ వాదనను ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ఖండించారు. ఆ తర్వాత స్పీకర్ కార్యాలయంలోని రికార్డులను చూసిన తర్వాత, ముఖ్యమంత్రిగా తాను ముసాయిదా బిల్లును కేబినెట్ ముందు ఉంచాలని మాత్రమే కోరానని, కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అంగీకరించారు. కాబట్టి దీనిని తన ప్రభుత్వ ఉద్దేశంగా చూడలేమని ఆయన అన్నారు.

ఈ బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఇది “ప్రజలకు వ్యతిరేకం, అమానవీయం, రాజ్యాంగ వ్యతిరేకం, పేదల వ్యతిరేకం మరియు కఠినమైనది” అని కూడా సిద్దరామయ్య అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించరాదని, ప్రభుత్వం దానిని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. బిల్లును ప్రస్తావిస్తూ.. 2016లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ సలహా మేరకు కర్ణాటకలోని లా కమిషన్ కొన్ని మార్పులతో బిల్లును ప్రవేశపెట్టిందని న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేసీ మధుస్వామి తెలిపారు.

ఈ బిల్లుకు కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. మతం మారాలనుకునే వారు తమ అసలు మతాన్ని కోల్పోతారని, రిజర్వేషన్‌తో సహా దానికి సంబంధించిన సౌకర్యాలు, ప్రయోజనాలను కోల్పోతారని రాష్ట్ర హోం మంత్రి అర్గ్ జ్ఞానేంద్ర అన్నారు. అయితే, ఆ వ్యక్తి ఏ మతాన్ని అవలంబిస్తాడో ఆ మతం యొక్క ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.

Read Also…. Night Curfew: కోరలు చాస్తున్న ఒమ్రికాన్.. రాత్రిపూట కర్ఫ్యూ విధింపు.. మధ్యప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం!