AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snakes Fight in Odisha : రెండు పాముల మధ్య భీకర యుద్ధం.. సోషల్ మీడియాలో వైరల్

సర్వ సాధారణంగా మనుషుల కొట్లాట, రెండు జంతువుల మధ్య కొట్లాట చూసి ఉంటారు అయితే ఇక రెండు జంతువుల మధ్య ప్రేమ వీడియోలు కూడా సర్వసాధారణమే.. ఆకోవలోకే వస్తుంది పాముల సయ్యాటను ..

Snakes Fight in Odisha : రెండు పాముల మధ్య భీకర యుద్ధం.. సోషల్ మీడియాలో వైరల్
Surya Kala
|

Updated on: Mar 04, 2021 | 5:42 PM

Share

Snakes Fighting  : సర్వ సాధారణంగా మనుషుల కొట్లాట, రెండు జంతువుల మధ్య కొట్లాట చూసి ఉంటారు అయితే ఇక రెండు జంతువుల మధ్య ప్రేమ వీడియోలు కూడా సర్వసాధారణమే.. ఆకోవలోకే వస్తుంది పాముల సయ్యాటను .. అందరూ చూసే ఉంటారు.. కానీ రెండు పాములు భయంకరంగా పోట్లాడుకోవడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? లేదు కదా.. రెండు పాములు భీకరంగా పోరాటం చేసుకుంటున్నాయి. రెండు పాములు ఒకదానిని ఒకటి మెలేసుకుని ముష్టియుద్ధం చేస్తున్నాయి. ఇందులో శాంట్ బువా అనే పాముతో నాలుగు అడుగు పొడవైన నాగుపాము పోట్లాటకు దిగింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ రెండు పాములు ఎక్కడ కొట్టుకున్నాయి వివరాల్లోకి వెళ్తే…

ఈ ఘటన ఒడిశాలోని జాజ్‌పూర్ గల ఓ గ్రామంలో చోటుచేసుకుంది. నిజానికి పాము కనిపిస్తే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీస్తాం.. అలాంటిది ఇక్కడ రెండు భారీ పాములు ఒక్కచోట చేరి, భీకరంగా పోట్లాడుకుంటున్నాయి. వీటిలో ఒకటి విషం లేని శాంట్ బువా పాము, మరొకటి నాలుగు అడుగుల స్పెక్టకాల్డ్‌ కోబ్రా. ఈ రెండు పాములు కూడా ఒకదానికొకటి చుట్టుకొని బుసలు కొడుతూ భీకరంగా కొట్టుకున్నాయి. అయితే ఈ సీన్‌ చూసిన అక్కడి స్థానికులు స్నేక్‌ సోసైటీ వారికి సమాచారం అందించారు. దాంతో వెంటనే స్నేక్ హెల్ప్‌లైన్ వాలంటీర్లు ఘటనా స్థలానికి చేరుకుని ఆ పాములను విడదీశారు. తర్వాత వాటిని జాగ్రత్తగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. పాములు పోరాడుతున్న సమయంలో ఎవరో తమ ఫోన్ కు పనిచెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Also Read:

టిక్‌టాక్‌కు పోటీగా సరికొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రముఖ సంస్థ.. ప్రస్తుతం ios ఫోన్లకే పరిమితం

దక్షిణాది మెగా మల్టీస్టార్ మూవీ ప్లాప్ అయితే ఇండస్ట్రీలో కొందరు నగ్నంగా డ్యాన్స్ చేస్తారంటున్న ఆర్జీవీ

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్