AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Netflix Launches Fast Laughs : టిక్‌టాక్‌కు పోటీగా సరికొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రముఖ సంస్థ.. ప్రస్తుతం ios ఫోన్లకే పరిమితం

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి సరికొత్త యాప్ తో ముందుకొచ్చింది. టిక్ టాక్ కు చెక్ పెట్టేలా తాజాగా...

Netflix Launches Fast Laughs : టిక్‌టాక్‌కు పోటీగా సరికొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రముఖ సంస్థ.. ప్రస్తుతం ios ఫోన్లకే పరిమితం
Surya Kala
|

Updated on: Mar 04, 2021 | 5:19 PM

Share

Netflix Launches Fast Laughs : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి సరికొత్త యాప్ తో ముందుకొచ్చింది. టిక్ టాక్ కు చెక్ పెట్టేలా తాజాగా ఫాస్ట్ లాఫ్స్ యాప్ ను ప్రారంభించింది. ఈ యాప్ మొబైల్ వినియోగదారులకు కామెడీ కేటలాగ్ నుండి ఫన్నీ క్లిప్‌ల ను , స్క్రీన్ ఫీడ్‌ను అందిస్తుంది. అయితే ఈ ఫాస్ట్ లాఫ్స్, ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రంలో అందుబాటులోకి వచ్చింది. ఇక iOS స్మార్ట్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. ఇది కూడా టిక్‌టాక్ , ఇన్‌స్టాగ్రామ్ లా కనిపిస్తుంది.

ఈ యాప్ లో ఆసక్తిని, హాస్యాన్ని కలిగించే చిన్న చిన్న వీడియోలు , పలు ప్రదర్శన్లోని ముఖ్య సన్నివేశాలు, కామెడీ యాక్టర్స్ వీడియో క్లిప్స్ నెట్‌ఫ్లిక్స్ యాప్ ద్వారా అనుసంధానమై నేరుగా ప్లే అవుతాయి. అంతేకాదు వినియోగదారులు కూడా తమకు నచ్చిన ప్రదర్శనలు, చలనచిత్రాలు, ప్రత్యేకతను తెలియజేస్తూ ఆసక్తిని రేకెత్తించే అంశాలు కూడా అప్ లోడ్ చేయవచ్చునని నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ ఫాస్ట్ లాఫ్స్ లోని సినిమాలు (మర్డర్ మిస్టరీ వంటివి), సిరీస్ (బిగ్ మౌత్), సిట్‌కామ్స్ (ది క్రూ) మరియు కెవిన్ హార్ట్ మరియు అలీ వాంగ్ వంటి హాస్యనటుల నుండి పూర్తి స్క్రీన్ ఫీడ్‌ను అందిస్తుంది. ఎవరైనా ఈ యాప్ ని యాక్టివేట్ చేసుకోవడానికి ముందుగా మీరు ఫాస్ట్ లాఫ్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.. అనంతరం దిగువ నావిగేషన్ మెను కనిపిస్తుంది. అనంతరం ఫీడ్‌ను యాక్సెస్ చేయాలి. అప్పటి నుంచి క్లిప్స్ ప్లే అవుతాయి. ఒకటి ముగిసిన తర్వాత మరొకటి ప్లే అవుతూనే ఉంటాయని.. అవి మిమ్మల్ని నవ్విస్తూ ఉంటాయని నెట్ ప్లిక్స్ చెప్పింది.

స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే లోని సిరీస్, ఫిల్మ్స్ చూడడానికి లేదా యాడ్ చేయడానికి వెంటనే అనుమతి లభిస్తుంది. ఈ యాప్ లో దొరికే క్లిప్స్ ను ఒక్కొక్కటిగా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ మరియు ట్విట్టర్‌లో పంచుకోవచ్చు, ప్రస్తుతం ఈ యాప్ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉన్నా.. త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్ల కూడా అందుబాటులోకి తీసుకుని రానున్నామని చెప్పారు.

Also Read:

మెరిసే దంతాల కోసం చింతా.. ‘పసుపు’ మీ చెంతన ఉందిగా.. ఎలా వాడాలంటే..!

 కనీవినీ ఎరుగని ధరకు అమ్ముడు పోయిన ఆర్‌.ఆర్‌.ఆర్‌ డిజిటల్‌ రైట్స్‌..? విడుదలకు ముందే రికార్డులు..