Turmeric For Teeth : మెరిసే దంతాల కోసం చింతా.. ‘పసుపు’ మీ చెంతన ఉందిగా.. ఎలా వాడాలంటే..!
భారతీయ వంటల్లో ఎక్కువగా ఉపయోగించే పసుపు ఒక ఆయుర్వేద గని.పసుపు లేని ఇల్లు దాదాపు ఉండదు. పసుపును వంటల్లోకే కాదు సబ్బులు, స్కిన్ కేర్ ప్రొడక్టులు, మందుల తయారీలో కూడా...
భారతీయ వంటల్లో ఎక్కువగా ఉపయోగించే పసుపు ఒక ఆయుర్వేద గని.పసుపు లేని ఇల్లు దాదాపు ఉండదు. పసుపును వంటల్లోకే కాదు సబ్బులు, స్కిన్ కేర్ ప్రొడక్టులు, మందుల తయారీలో కూడా వాడుతారని మనకు తెలుసు, అయితే ఈ పసుపు ఇది దంత సంరక్షణకు ఉపయోగపడుతుంది. పూర్వకాలంలో టూత్ పేస్టులు అందుబాటులోకి రాని సమయంలో దంతాలను శుభ్రపరచుకోవడానికి వేపపుల్లని, లేదా పసుపు, ఉప్పు వంటివి ఉపయోగించేవారు. అయితే కాలక్రమంలో వీటి స్థానంలో టూత్ పేస్ట్ వచ్చింది.. అయితే ఇప్పుడు వస్తున్న అనారోగ్యాలతో మళ్ళీ పూర్వకాలం వైపు చూస్తున్నారు అందరూ.. తాజాగా పసుపుకి దంతాలను సంరక్షించే గుణంతో పాటు మెరిసేలా చేస్తుంది తెలుస్తోంది.
దంతాలు తెల్లబడటం కోసం ఇది ఇంటి దంత సంరక్షణలో చోటు సంపాదించింది. పసుపు వాడటం సురక్షితం, ఇది ఇతర దంత చికిత్సల కంటే బాగా పనిచేస్తుంది. 2012 లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం పసుపులోని కర్కుమిన్ చిగురువాపు లేదా చిగుళ్ల వ్యాధిని నివారించగలదని నిరూపించబడింది. ఇది దంత నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. వివిధ నోటి క్యాన్సర్లను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
దంతాలపై పసుపు అప్లై చేసే విధానం :
కొద్దిగా పసుపు పొడి తీసుకుని చిగుళ్లు, దంతాల మీద రుద్దాలి. ఆ తరువాత బ్రష్ చేయాలి. వెంటనే కడిగే బదులు, పౌడర్ కనీసం ఐదు నిమిషాలు మీ దంతాలపై ఉంచండి. తరువాత, మీ నోటిని నీటితో బాగా కడగాలి. అప్పుడు, సాధారణ టూత్‌పేస్ట్, టూత్ పౌడర్ లేదా ఇతర దంతాలను శుభ్రపరిచే ఉత్పత్తితో మీ దంతాలను మళ్లీ బ్రష్ చేయండి. నోరు ఇంకా పసుపుగానే ఉంటే మరోసారి బ్రష్ చేయాలి.
పసుపు టూత్ పేస్ట్ ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు..
4 స్పూన్ల ఇంట్లోనే తయారు చేసిన పసుపు కొమ్ముల పొడి 2 స్పూన్ల బేకింగ్ పౌడర్ 3 స్పూన్ల కొబ్బరి నూనె ఈ మూడింటిని బాగా కలపాలి. కొద్దిగా తీసుకుని బ్రష్ మీద పెట్టి పళ్లు రుద్దాలి.పళ్ళు తెల్లబడటానికి పసుపు వాడటం ప్రమాదం కాదు. అయితే, పసుపును ఉపయోగించే ముందు మీకు అలెర్జీ ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోండి. రోజుకు ఒకసారి మాత్రమే ఈ పసుపు పేస్ట్‌తో బ్రష్ చేసుకోవాలి. దంతాల సంరక్షణ కోసం పసుపు సురక్షితమైన ఎంపిక.
Also Read: