RGV Sensational Comments : దక్షిణాది మెగా మల్టీస్టార్ మూవీ ప్లాప్ అయితే ఇండస్ట్రీలో కొందరు నగ్నంగా డ్యాన్స్ చేస్తారంటున్న ఆర్జీవీ

చిత్ర పరిశ్రమలో ఎవడికి వాడేనని.. బయటకు ఒకలా.. లోపల ఒకలా ఉంటారని జీవిత సత్యాన్ని చెప్పారు వర్మ.. అంతేకాదు పై పై నటనను చూసి లోపల అంచనా వేయకూడదని కూడా ఉపదేశం..

RGV Sensational Comments : దక్షిణాది మెగా మల్టీస్టార్ మూవీ ప్లాప్ అయితే ఇండస్ట్రీలో కొందరు నగ్నంగా డ్యాన్స్ చేస్తారంటున్న ఆర్జీవీ
Follow us
Surya Kala

|

Updated on: Mar 04, 2021 | 4:22 PM

RGV Comments on RRR Moive : శివ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు నోటికి పని చెబుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఈ సంచలన దర్శకుడికి నాలుగు నడిచే బాట కూడా నచ్చదు.. ఊరందరిదీ ఓ దారి.. ఉలిపిరి కట్టదో దారి అన్న సామెతను నరనరాన జీర్ణించుకున్నాడు ఈ వివాదాల వర్మ.  గత కొంతకాలంగా నిజజీవితంలో జరిగిన సంఘటనలే నా సినిమాలు అంటూ హల్ చల్ చేస్తున్న వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోనూ చిత్ర పరిశ్రమలో ఎవడికి వాడేనని.. బయటకు ఒకలా.. లోపల ఒకలా ఉంటారని జీవిత సత్యాన్ని చెప్పారు వర్మ.. అంతేకాదు పై పై నటనను చూసి లోపల అంచనా వేయకూడదని కూడా ఉపదేశం చేశారు. అయితే ఈ సందర్భంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మెగా మల్టీస్టార్ మూవీ ఆర్ఆర్ఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు.

ఇండస్ట్రీ ఒకరినొకరు పట్టించుకోరని.. అదే ఎవరైనా నష్టపోతే మాత్రం వాళ్లపై రకరకాల జోక్స్ వేసుకుంటూ రాక్షసానందం పొందుతారని చెప్పారు వర్మ. నిజానికి రాజమౌళి వరస హిట్స్ అందుకున్నాడని ఎదురుగా ప్రశంసిస్తారు.మనసులో మాత్రం కుళ్ళు కుంటారని చెప్పాడు.. అదే రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ ప్లాప్ అయితే మాత్రం వెంటనే పండగ చేసుకుంటారు ఇది వాస్తవం అని చెప్పాడు. ఇది నిజమైన ఎవరూ ఒప్పుకోరు ఎందుకంటే ఇక్కడ తెరమీదనే కాదు తెరవెనుక నటించేవారుకూడా ఉన్నారు అన్నారు ఆర్జీవీ.

ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అంటున్నవారు ఒకవేళ రేపు ఆర్ఆర్ఆర్ ప్లాప్ అయితే ఇండస్ట్రీలో చాలా మంది నడిరోడ్డుపై బట్టలు విప్పి పండగ చేసుకుంటారని .. అంటున్నాడు వర్మ . అయితే ఈ కామెంట్స్ పై ఎప్పటిలా ఆర్జీవీ సపోర్ట్స్ నిజమేగా అంటే.. మరికొంత మంది ఇదేమి పైత్యం అని అంటున్నారు.

Also Read: : ఈ ప్రాంతంలో అతీంద్రశక్తులు.. రాళ్లకు రాసలీల తెలుసు.. ప్రతి నిర్మాణం వెనుక అనేక కథలు కూడా

“టక్ ఎలిఫెంట్”.. ట్విట్టర్‌ యమ ట్రెండ్… అడుగులో అడుగేస్తూ తకిదిమితోం