Elephant wearing clothes: “టక్ ఎలిఫెంట్”.. ట్విట్టర్ యమ ట్రెండ్… అడుగులో అడుగేస్తూ తకిదిమితోం
ఓ పెద్ద ఏనుగు ఫ్యాంటు, షర్టు వేసుకుని రోడ్డుపై నడుస్తూ వెళ్తుంది దీనిని చూశారా? ఇది చూసి కార్టూన్ అనుకుంటున్నారా? కాదండి..
Elephant wearing clothes: ఓ పెద్ద ఏనుగు ఫ్యాంటు, షర్టు వేసుకుని రోడ్డుపై నడుస్తూ వెళ్తుంది దీనిని చూశారా? ఇది చూసి కార్టూన్ అనుకుంటున్నారా? కాదండి.. నిజంగానే ఏనుగు ప్యాంట్‌షర్ట్ వేసుకుంది. అంతేకాదు.. ఆ ప్యాంట్ జారిపోకుండా బెల్టు కూడా పెట్టుకుంది. అలా జాలీగా రోడ్డుపై నడుస్తూ షికారుకు వెళ్లింది. ప్యాంట్ షర్ట్ వేసుకుని రోడ్డుపై వెళ్తున్న ఆ ఏనుగును జనాలు నోరెళ్లబెట్టి మరీ చూశారు. అలాగే దాని ఫొటోలు తీసి నెట్టింట్లో షేర్ చేశారు.
ఇదిలావుంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఈ ఏనుగు ఫోటో చూసి ఫిదా అయ్యారు. ఫన్నీ కామెంట్లతో తన ఫాలోవర్లను ఆకట్టుకొనే ఆయన ఈ ఫొటోను ట్వీట్ చేశారు. చొక్కా, ప్యాంట్ ధరించిన ఆ ఏనుగును చూసి.. ఫన్నీగా కామెంట్ చేశారు. ‘‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా. ఎలీ-ప్యాంట్(Ele-Pant)’’ అని క్యాప్షన్ జోడించారు.
Incredible India. Ele-Pant… pic.twitter.com/YMIQoeD97r
— anand mahindra (@anandmahindra) March 3, 2021
ఈ ఫొటోలో ఏనుగు బుద్ధిగా ఊదా రంగు చొక్కా, తెల్ల ఫ్యాంట్ ధరించి.. మావటి వెనుక అడుగులో అడుగు వేసుకుంటూ ఎంతో చూడముచ్చటగా ముందుకు సాగుతోంది. దీంతో ఈ ఫొటో క్షణాల్లో వైరల్‌గా మారింది. అయితే, నెటిజనులు ఈ ఫొటోను చూసి కామెంట్లు చేయకుండా ఉండలేకపోతున్నారు. మావటి లుంగీ ధరిస్తే.. ఏనుగు చూశారా ఫ్యాంట్ షర్టు వేసుకుని ఎంత దర్జాగా నడుస్తుందోనని ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే ‘టక్ ఎలిఫెంట్’ అని రాసుకొస్తున్నారు. ఇదిలావుంటే కొంతమంది దీన్ని ఫన్ థింగ్ అనుకోవద్దని, ఇది వన్య ప్రాణులను హింసించే చర్య అని విమర్శలు చేస్తున్నారు.
Also Read:
తెలంగాణ పిల్ల పాట.. హైబ్రిడ్ పిల్ల ఆట.. ‘సారంగదరియా’, సూపర్ హిట్టయ్యా..!
సింగిల్ నైట్‌లో సాంగ్ షూటింగ్ కంప్లీట్.. యూనిట్ అంతా షాక్.. అతిలోకసుందరి తనయా మజాకా..!