Saranga Dariya Song: తెలంగాణ పిల్ల పాట.. హైబ్రిడ్ పిల్ల ఆట.. ‘సారంగదరియా’, సూపర్ హిట్టయ్యా..!

సిల్వర్‌ స్క్రీన్‌ను మాస్‌ మేనియాతో ఊపేస్తున్నారు సింగర్‌ మంగ్లీ. ఈ మధ్య కాలంలో బ్లాక్‌ బస్టర్ హిట్ అయిన మాస్‌ మాసాల నెంబర్స్‌లో మంగ్లీ పాడిన పాటలే ఎక్కువగా ఉన్నాయి.

Saranga Dariya Song:  తెలంగాణ పిల్ల పాట.. హైబ్రిడ్ పిల్ల ఆట.. 'సారంగదరియా', సూపర్ హిట్టయ్యా..!
Saranga-Dariya-Song
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 04, 2021 | 3:35 PM

సిల్వర్‌ స్క్రీన్‌ను మాస్‌ మేనియాతో ఊపేస్తున్నారు సింగర్‌ మంగ్లీ. ఈ మధ్య కాలంలో బ్లాక్‌ బస్టర్ హిట్ అయిన మాస్‌ మాసాల నెంబర్స్‌లో మంగ్లీ పాడిన పాటలే ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్ బ్లాక్‌ బస్టర్ సారంగదరియా సక్సెస్‌తో మంగ్లీ పేరు మరోసారి మరోమోగుతోంది. లవ్‌ స్టోరి సినిమా కోసం మంగ్లీ పాడిన ఈ పాట యూట్యూబ్‌ రికార్డ్‌ను షేక్‌ చేస్తోంది.  సారంగదరియా పాట ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్. ఎవరి కాలర్ ట్యూన్ విన్నా, ఏ పంక్షన్‌కు వెళ్లినా ఈ సాంగ్ మోత మోగుతుంది. మంగ్లీ అదిరిపోయే వాయిస్‌కు.. సాయిపల్లవి సాలిడ్ స్టెప్పులు తోడవ్వడంతో పాట ట్రెండ్ మాములుగా సాగడం లేదు. గత నెల 28న ఈ సాంగ్ రిలీజ్ చేశారు. నేడు కూడా యూట్యూబ్ నంబర్ 2 ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఇక గీత రచయిత సుద్దాల అశోక్ తేజ గురించి చెప్పేది ఏముంటుంది. ఎప్పట్లానే అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు.

గతంలోనూ నాగచైతన్య కోసమే మరో సూపర్ హిట్ నెంబర్ ఆలపించారు మంగ్లీ. శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో మంగ్లీ పాట అప్పట్లో చార్ట్ బస్టర్స్‌లో టాప్‌లో నిలిచింది. తరువాత ‘వాడు నడిపే బండి’ అంటూ జార్జ్‌ రెడ్డి సినిమా కోసం పాడిన పాట మరో సెన్సేషన్‌. సినిమా సక్సెస్‌ కాకపోయినా… ఆ పాట మాత్రం సూపర్ హిట్ అయ్యింది.

అల వైకుంఠపురములో సినిమా ఇండస్ట్రీ హిట్ కావటం వెనక కూడా మంగ్లీ సాయం కూడా ఉంది. ఈ మూవీలో సూపర్ హిట్ అయిన రాములో రాములా పాటలో వినిపించిన ఫీమేల్‌ వాయిస్ మంగ్లీదే. సినిమా రిలీజ్‌కు ముందే సూపర్ హిట్ అయిన ఈ సాంగ్‌ను అనురాగ్‌ కులకర్ణితో కలిసి ఆలపించారు మంగ్లీ.

ఆఫ్టర్ లాక్‌ డౌన్‌.. బ్లాక్ బస్టర్‌ ఆడియోస్‌ అన్ని తన ఖాతాలోనే వేసుకుంటున్నారు మంగ్లీ. సంక్రాంతి సీజన్‌లో రెండు మాస్‌ మాసాలా నెంబర్స్ వస్తే.. ఆ రెండూ మంగ్లీనే ఆలపించారు. క్రాక్‌తో ‘భూమ్‌ బద్దల్‌’, అల్లు అదుర్స్‌లో ‘రంభా ఊర్వశీ మేనకా’ పాటలు పాడి.. తన పాటకు తన పాటతోనే పోటి ఇచ్చారు.

ప్రజెంట్‌ మరో రెండు సూపర్‌ హిట్స్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నారు. చావు కబురు చల్లగా సినిమాలో పైన పటారం అంటూ ఊర మాస్‌ సాంగ్‌ను పాడిన మంగ్లీ… లవ్‌ స్టోరి సినిమాలో సారంగదరియా పాటతో తన మార్క్‌ జానపదాన్ని రుచి చూపించారు. ఇలా వరుసగా సూపర్‌ హిట్‌ సాంగ్స్‌తో మాస్ కు కేరాఫ్‌గా మారిపోతున్నారు.

Also Read:

సిసింద్రీ కుర్రాడి ఫేట్ నంబర్ 4తో మారేనా.. ఇంతకీ ఏమిటీ నంబర్‌ గేమ్..! తెలుసుకుందాం పదండి

సింగిల్‌ నైట్‌లో సాంగ్ షూటింగ్ కంప్లీట్.. యూనిట్ అంతా షాక్.. అతిలోకసుందరి తనయా మజాకా..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?