Naga Chaitanya : అభిమాన హీరో కోసం గోదావరిలో దూకిన యువకుడు.. షాక్ తిన్న ఆ హీరో ఏంచేసాడంటే..

హీరోలకు అభిమానులు ఉంటారు. వీరాభిమానులు ఉంటారు. అభిమానులు వల్ల హీరోలకు పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వవూ కానీ కొంతమంది వీరాభిమానులు మాత్రం తమ హీరోలకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతుంటారు.

Naga Chaitanya : అభిమాన హీరో కోసం గోదావరిలో దూకిన యువకుడు.. షాక్ తిన్న ఆ హీరో ఏంచేసాడంటే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 04, 2021 | 3:19 PM

Naga Chaitanya : హీరోలకు అభిమానులు ఉంటారు. వీరాభిమానులు ఉంటారు. అభిమానులు వల్ల హీరోలకు పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వవూ కానీ కొంతమంది వీరాభిమానులు మాత్రం తమ హీరోలకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతుంటారు. కొంతమంది తమ హీరోను చూడటానికి టవర్లు ఎక్కుతారు. మరి కొంతమంది ప్రాణాలు లెక్క చేయకుండా చిత్ర విచిత్ర పనులు చేస్తున్నారు. తాజాగా ఓ  వీరాభిమాని కూడా అలాంటి సాహసమే చేశాడు.

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కోసం ఒక అభిమాని ఏకంగా గోదావరిలోకి దూకాడు. దూకింది ఆత్మహత్య చేసుకోవడానికి కాదులెండి . తన ఫ్యావరెట్ హీరో పడవలో వెళ్తున్నాడని తెలిసి ఓ అభిమాని బ్రిడ్జ్ పై నుంచి నదిలోకి దూకేసాడు. నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ మూవీని చేస్తున్న విషయం తెల్సిందే. గోదావరి జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

చైతూ ఉన్న బోటుకు అతి సమీపరంలో ఆ అభిమాని దూకి అక్కడ నుండి వెంటనే ఈదుకుంటూ వెళ్లి పోయాడు. షూటింగ్ అంతా పూర్తి అయిన తర్వాత అతడిని చైతూ పిలిపించి ఫొటో దిగి మళ్లీ ఇలాంటి సాహసాలు చేయవద్దంటూ సున్నితంగా హెచ్చరించి కొద్ది సమయం మాట్లాడి పంపించేశాడు. గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో చాలా మంది నాగచైతన్యను చూసేందుకు తరలి వచ్చారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో  నటించిన లవ్ స్టోరీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Janhvi Kapoor: సింగిల్‌ నైట్‌లో సాంగ్ షూటింగ్ కంప్లీట్.. యూనిట్ అంతా షాక్.. అతిలోకసుందరి తనయా మజాకా..!

సిసింద్రీ కుర్రాడి ఫేట్ నంబర్ 4తో మారేనా.. ఇంతకీ ఏమిటీ నంబర్‌ గేమ్..! తెలుసుకుందాం పదండి.