నాగార్జున, కళ్యాణ్ క్రిష్ణ కాంబో క్రేజీ అప్ డేట్… ‘బంగార్రాజు’ సిక్వేల్ పట్టాలెక్కెది అప్పుడే…

సోగ్గాడే చిన్ని నాయనా` లాంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించారు కళ్యాణ్ కృష్ణ. ఆ వెంటనే ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా ప్రకటించారు. కానీ ఈలోగానే ఈ మూవీకి రకరకాల అడ్డంకులు. క‌ల్యాణ్ కృష్ణ డైరెక్ష‌న్ లో వచ్చిన

  • Rajeev Rayala
  • Publish Date - 3:14 pm, Thu, 4 March 21
నాగార్జున, కళ్యాణ్ క్రిష్ణ కాంబో క్రేజీ అప్ డేట్...  'బంగార్రాజు' సిక్వేల్ పట్టాలెక్కెది అప్పుడే...

సోగ్గాడే చిన్ని నాయనా` లాంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించారు కళ్యాణ్ కృష్ణ. ఆ వెంటనే ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా ప్రకటించారు. కానీ ఈలోగానే ఈ మూవీకి రకరకాల అడ్డంకులు. క‌ల్యాణ్ కృష్ణ డైరెక్ష‌న్ లో వచ్చిన ఈ మూవీ మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వ‌స్తోన్న ప్రాజెక్టు బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ సోదరుని ఆకస్మిక మరణం వల్ల కూడా ఈ మూవీ డిలే అయ్యింది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్ ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. జులై నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకానుంది. వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2న థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేస్తారు. హిందీ బ్లాక్ బస్టర్ రైడ్ కి రీమేక్ ఇదని చెబుతున్నారు. ఈ మూవీని జూన్ లోపే పూర్తి చేసి బంగార్రాజు సెట్స్ కెళతారట. సీక్వెల్‌లో ర‌మ్య‌కృష్ణ‌తోపాటు నాగచైత‌న్య‌, ర‌ష్మిక మంద‌న్నా కీ రోల్స్ పోషిస్తార‌ని టాక్ న‌డుస్తోంది.

సోగ్గాడే చిన్ని నాయ‌నా పార్టులో నాగార్జున‌-ర‌మ్య‌కృష్ణ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. మ‌రి సెకండ్ పార్టులో ఈ సీనియ‌ర్ యాక్ట‌ర్లిద్ద‌రూ ఆడియెన్స్ ను ఎలా ఎంట‌ర్ టైన్ చేస్తారో చూడాలి. కచ్ఛితంగా బంగార్రాజు ఇన్ టైమ్ లో స్టార్టయి సంక్రాంతికి వచ్చేస్తుందా? అన్న సందేహం ఉంది. గతంలో సోగ్గాడే చిత్రం భారీ కాంపిటీషన్ నడుమ సంక్రాంతి బరిలో రిలీజై బ్లాక్ బస్టర్ కొట్టింది. అదే తీరుగా బంగార్రాజును తెలివిగా కొంత గ్యాప్ తో రిలీజ్ చేసి పండగ రేసులో పోటీపడనుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Naga Chaitanya : అభిమాన హీరో కోసం గోదావరిలో దూకిన యువకుడు.. షాక్ తిన్న ఆ హీరో ఏంచేసాడంటే..

Saranga Dariya Song: తెలంగాణ పిల్ల పాట.. హైబ్రిడ్ పిల్ల ఆట.. ‘సారంగదరియా’, సూపర్ హిట్టయ్యా..!