AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిసింద్రీ కుర్రాడి ఫేట్ నంబర్ 4తో మారేనా.. ఇంతకీ ఏమిటీ నంబర్‌ గేమ్..! తెలుసుకుందాం పదండి.

Most Eligible Bachelor :మిగతా హీరోలంతా రిలీజులు, షూటింగ్స్‌తో హర్రీబర్రీగా వుంటే.. సిసింద్రీ హీరో అఖిల్ ఏం చేస్తున్నారు? వన్, ‌టు, త్రీ, ఫోర్లు లెక్కబెట్టుకుంటున్నారు.

సిసింద్రీ కుర్రాడి ఫేట్ నంబర్ 4తో మారేనా.. ఇంతకీ ఏమిటీ నంబర్‌ గేమ్..! తెలుసుకుందాం పదండి.
Ram Naramaneni
|

Updated on: Mar 04, 2021 | 1:48 PM

Share

Akkineni Akhil: మిగతా హీరోలంతా రిలీజులు, షూటింగ్స్‌తో హర్రీబర్రీగా వుంటే.. సిసింద్రీ హీరో అఖిల్ ఏం చేస్తున్నారు? వన్, ‌టు, త్రీ, ఫోర్లు లెక్కబెట్టుకుంటున్నారు. వన్, ‌టూ, త్రీ నడవలేదు.. ఫోర్ నంబర్‌ వెయిట్ అండ్ సీ అంటోంది. ఇక… ఐదు మీదైనా బెట్ పెడదామా అంటున్నారు. ఇంతకీ ఏమిటీ నంబర్‌ గేమ్..! తెలుసుకుందాం పదండి.

తాను కూడా ముందుకే చూస్తున్నా అని క్లియర్‌కట్‌ సిగ్నల్స్ ఇస్తున్నారు అఖిల్ అక్కినేని. సురేందర్‌రెడ్డి డైరెక్ట్ చేసే అఖిల్‌ మూవీ నెక్స్ట్ వీక్‌లో పట్టాలెక్కబోతోంది. అనౌన్స్‌మెంట్ తర్వాత ఇన్నాళ్లూ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మీదే సిట్టింగేసిన సూరి.. కమాన్ బాయ్, లెట్స్‌ గో అంటూ అఖిల్‌ని షూట్స్‌లో జాయిన్ చేసుకోబోతున్నారు.

వీకెండ్స్‌లో గుర్రపుస్వారీ ప్రాక్టీస్ చేసి పర్‌ఫెక్షన్ సాధించిన అఖిల్.. తర్వాత మాల్దీవుల్లో వెకేషన్‌కెళ్లి ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడంతో.. బాడీ బిల్డింగ్‌ మీద స్పెషల్‌గా ఫోకస్ పెట్టారు. ఇటు.. అఖిల్‌-సూరీ కాంబోలో రాబోయే ఈ క్రేజీ మూవీలో ఉప్పెన ఫేమ్‌ క్రితిశెట్టి హీరోయిన్‌గా నటించే ఛాన్సుంది.

నాగార్జున ఒక వైపు తన సినిమాల్ని చక్కబెట్టుకుంటూనే.. మరోవైపు చైతూ-అఖిల్ గ్రాఫ్‌ని కూడా ఓరకంట గమనిస్తున్నారు. లవ్‌స్టోరీ రిలీజ్ టైమ్‌లో అఖిల్‌తో పాటు ప్రమోషన్‌లో నాగ్‌ పార్టిసిపేట్ చేసే ఛాన్సుంది. ఇటు… అఖిల్ కెరీర్‌లో ఫోర్త్‌ మూవీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్’ జూన్ 19న విడుదలవుతోంది. ఈ మూవీ ఫైనల్‌ ఔట్‌పుట్ అయ్యాక్కూడా బెటర్‌మెంట్‌ కోసం కొన్ని సజెషన్స్ ఇచ్చారట నాగార్జున. సో.. వన్‌టూత్రీ మిస్సయినా.. ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మూవీస్‌ మీద బెటర్ హోప్స్ పెట్టుకున్నారు సిసింద్రీ కుర్రాడు.

మరోవైపు  నాగార్జున తాజాగా ‘వైల్డ్ డాగ్’ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా ఏప్రిల్ 2న థియేరట్లలో గ్రాండ్‌గా విడుదలవ్వనుంది.  కరోనా సమయంలో షూటింగ్ చేసిన ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో ప్రేక్షకులు చూస్తారో లేదో అనుమానంతో ముందుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యేలా అగ్రిమెంట్ చేసుకున్నారు నిర్మాతలు. అయితే ప్రస్తుతం పరిస్థితులు కుదటపడటంతో థియేటర్లవైపే మొగ్గు చూపారు.

Also Read:

క్రాక్‌, ఉప్పెన విజయాలతో టాలీవుడ్‌కు జోష్.. మార్చిలో భారీగా విడుదల కానున్న సినిమాలు.. లిస్ట్ ఇదిగో

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్