క్రాక్‌, ఉప్పెన విజయాలతో టాలీవుడ్‌కు జోష్.. మార్చిలో భారీగా విడుదల కానున్న సినిమాలు.. లిస్ట్ ఇదిగో

కరోనా తరువాత సినిమాల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలకు సమాధానం దొరికేసింది. ఎన్ని ఓటీటీలు వచ్చినా... ఆడియన్స్‌ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ కోరుకుంటారన్న విషయం ప్రూవ్‌ అయిపోయింది.

క్రాక్‌, ఉప్పెన విజయాలతో టాలీవుడ్‌కు జోష్.. మార్చిలో భారీగా విడుదల కానున్న సినిమాలు.. లిస్ట్ ఇదిగో
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 04, 2021 | 1:32 PM

Tollywood: కరోనా తరువాత సినిమాల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలకు సమాధానం దొరికేసింది. ఎన్ని ఓటీటీలు వచ్చినా… ఆడియన్స్‌ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ కోరుకుంటారన్న విషయం ప్రూవ్‌ అయిపోయింది. దీంతో మేకర్స్ వరుస రిలీజ్‌లకు రెడీ అవుతున్నారు. జనవరిలో ట్రయల్ వేసిన మేకర్స్‌ ఫిబ్రవరిలో మరిన్ని రిలీజ్‌లతో హడావిడి చేశారు. ఇక మార్చి వచ్చేసరికి అంతా నార్మల్‌ అయిపోయినట్టుగానే ఉంది. వరుస రిలీజ్‌లతో హల్‌ చల్‌ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. క్రాక్‌, ఉప్పెన లాంటి సక్సెస్‌లతో సిల్వర్‌ స్క్రీన్‌కు మరింత జోష్ వచ్చింది. లాక్‌ డౌన్‌ తరువాత ఆడియన్స్‌ రారేమో అన్న భయాలు కూడా తొలగిపోయాయి. దీంతో చిన్న పెద్ద సినిమాలు వరుస రిలీజ్‌లకు క్యూ కట్టేస్తున్నాయి. ముఖ్యంగా మార్చిలో ఈ సందడి బాగా కనిపిస్తోంది. ఈ నెల ప్రతీ వారం రెండుమూడు ఇంట్రస్టింగ్ సినిమాలు వెండితెర మీద సందడి చేయనున్నాయి.

ఫస్ట్ ఫ్రైడే… మార్చి 5న టాలీవుడ్‌లో ఆరు సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. వీటిలో సందీప్ కిషన్‌ హీరోగా తెరకెక్కిన ఏ1 ఎక్స్‌ప్రెస్‌, రాజ్‌ తరుణ్ నటించిన పవర్‌ ప్లే సినిమాలకు పాజిటివ్‌ బజ్‌ వస్తోంది. డిఫరెంట్‌ జానర్‌లో రూపొందిన ఏ, ప్లేబ్యాక్‌, క్లైమాక్స్‌ సినిమాలపై పెద్దగా బజ్‌ లేకపోయినా ట్రైలర్‌, టీజర్లు ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి. ఇక దిల్ రాజు‌ బ్యానర్‌పై తెరకెక్కిన షాదీ ముబారక్‌, అవుట్ అండ్ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ ముందుకు వస్తోంది.

మార్చి సెకండ్‌ ఫ్రైడే వెండితెర మరింత వేడెక్కనుంది. మూడు కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. శ్రీవిష్ణు హీరోగా అనిల్‌ రావిపూడి సమర్పణలో తీసిన గాలి సంపత్‌…. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్‌ రోల్స్‌గా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్‌ జాతి రత్నాలు.. శర్వానంద్‌ హీరోగా ఫ్యామిలీ ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ శ్రీకారం… ఈ మూడు సినిమాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. దీంతో ఈ పోటి ఆసక్తికరంగా మారింది.

సెకండ్ వీక్ సిచ్యుయేషనే థర్డ్‌ వీక్‌లోనూ కనిపించనుంది. మార్చి 19న కూడా మూడు సినిమాలు సిల్వర్‌ స్క్రీన్ మీద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన మల్టీ లింగువల్ క్రాసోవర్‌ మూవీ మోసగాళ్లు, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో కార్తికేయ హీరోగా చావు కబురు చల్లగా, ఆది సాయి కుమార్‌ హీరోగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ శశి… ఈ మూడు సినిమాలు మూడు డిఫరెంట్‌ జానర్‌ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తున్నాయి. మార్చి లాస్ట్ వీక్‌ మరింత బిగ్‌ ఫైట్‌ జరగనుంది. స్టార్ ఇమేజ్‌ ఉన్న ఇద్దరు హీరోలు ఒకేరోజు సిల్వర్‌ స్క్రీన్ మీద తలపడుతున్నారు. అరణ్య సినిమాతో రానా, రంగ్‌ దే సినిమాతో నితిన్‌.. ఒకే రోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెలలో ఆడియన్స్‌ ముందుకు వస్తున్న బిగ్ మూవీస్ ఇవే కావటంతో ఆడియన్స్‌ వీటికోసం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అక్కడితో అయిపోలేదు.

లాస్ట్ సాటర్‌డే కూడా ఓ సినిమా ఆడియన్స్‌ ముందుకు వస్తోంది. మత్తు వదలరాతో ఆడియన్స్‌ను పలకరించిన కీరవాణి తనయుడు.. ‘తెల్లవారితే గురువారం’ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో వస్తున్నారు. ఇలా… వరుస రిలీజ్‌లతో ఆడియన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు టాలీవుడ్ మేకర్స్‌.

Also Read:

అన్నను అతికిరాతకంగా చంపిన తమ్ముడు.. యాక్సిడెంట్ చేసి.. కుడికాలు నరికేసి.. కత్తితో పొడిచి.. పొడిచి

మీరు రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా..? ఈ నంబర్ల ద్వారా ఫిర్యాదు చేయండి

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు