Parineeti Chopra : మహేష్ పై మనసుపడ్డ బాలీవుడ్ బబ్లీ బ్యూటీ.. సూపర్ స్టార్‌తో తప్ప మరే హీరో వద్దంటున్న పరిణీతిచోప్రా
టాలీవుడ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే, కటౌట్లు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు..
Parineeti chopra about Mahesh : టాలీవుడ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే, కటౌట్లు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు అంటూ అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతాకాదు. ఇక మహేష్ కు ఉన్న లేడీ ఫ్యాన్స్ మరే హీరోకు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. వయసు పెరుగుతున్న ఇంకా చిన్నపిల్లాడిలా కనిపిస్తుంటాడు ఈ రాజకుమారుడు. హీరోయిన్స్ కుడా చాలా మంది మహేష్ ను ఇష్టపడుతుంటారు.. మహేష్ సినిమాలో అవకాశం కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు కూడా.. ఇక మనోడికి ఇక్కడే కాదు బాలీవుడ్ లో కూడా యమా క్రేజ్ ఉంది. తాజాగా ఓ హీరోయిన్ కూడా మహేష్ అందానికి ఫిదా అయ్యానంటూ చెప్పుకొచ్చింది. ఆ అమ్మడు ఎవరో కాదు.. బాబ్లీ బ్యూటీ పరిణీతిచోప్రా.
బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో పరిణీతిచోప్రా ఒకరు. ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. త్వరలో సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైనా’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రీ లుక్ ఇటీవలే విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది ఈ బాబ్లీ బ్యూటీ. అలాగే హిందీలో మరో సినిమాలో నటిస్తుంది. ‘ది గర్ల్ బిహైండ్ ఆన్ ది ట్రైన్’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ పై ఆసక్తికర కామెంట్లు చేసింది ఈ చిన్నది.
టాలీవుడ్ లో మహేష్ అంటే చాలా ఇష్టమని, అతని అందం , ఆయన లుక్స్ అంటే చాలా చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక మహేష్ సినిమాలో అవకాశం వస్తే అస్సలు వదులుకొనని చెప్పుకొచ్చింది. అలాగే ఒక వేళ తెలుగులో సినిమా చేయాల్సి వస్తే ఒక్క మహేష్ బాబు సినిమాలోనే చేస్తానని.. మరే హీరో సినిమాలో చేయనని తెలిపింది ఈ బాలీవుడ్ భామ. మరి ఫ్యూచర్ లో ఈ అమ్మడికి మహేష్ తో నటించే అవకాశం వస్తుందేమో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :
Fahadh Faasil : షూటింగ్ లో గాయపడిన హీరో.. బిల్డింగ్ పైనుంచి కిందపడటంతో గాయాలు.. ప్రమాదంలో..
ఐటీ దాడులు జరగడానికి ముందు ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ ఎవరిని కలుసుకున్నారంటే “