ఐటీ దాడులు జరగడానికి ముందు ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ ఎవరిని కలుసుకున్నారంటే “
తన ఇల్లు, కార్యాలయాలపై బుధవారం ఐటీ దాడులు జరగడానికి ముందు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ తనకు ఎంతో సన్నిహితుడైన భారతీయ కామ్ గార్ సేన నేత రఘునాథ్ కుచిక్ ని పూణేలో కలుసుకున్నారు.
తన ఇల్లు, కార్యాలయాలపై బుధవారం ఐటీ దాడులు జరగడానికి ముందు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ తనకు ఎంతో సన్నిహితుడైన భారతీయ కామ్ గార్ సేన నేత రఘునాథ్ కుచిక్ ని పూణేలో కలుసుకున్నారు. కుచిక్..మహారాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ కూడా..ఈ నెల 1 న తాను, అనురాగ్ కశ్యప్ కలిశామని. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో బాలీవుడ్ కార్మికులను తాము ఎలా ఆదుకున్నామో చర్చించుకున్నామని ఆయన చెప్పారు. అలాగే కశ్యప్ కూడా నాడు తమ చిత్ర రంగం ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించారు. 80 వ్యానిటీ వ్యానుల్లో మేం అన్ని నిత్యావసరాలను కొని రోజులపాటు వారికి పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా నిన్న అనురాగ్ కశ్యప్ తో బాటు నటి తాప్సీ పొన్ను, మధు మంతెన, వికాస్ బెహల్ తదితర సెలబ్రిటీల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను ఎగవేత కేసులో కశ్యప్, తాప్సి పొన్నులను విచారించినట్టు ఈ శాఖ అధికారులు తెలిపారు.వీరికి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని, వీరు గడించిన లాభాలకు, రిటర్నులకు పొంతన లేదని వారు వెల్లడించారు.
మరో మూడు రోజులపాటు వీరి నివాసాలపై దాడులు, సోదాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ దాడుల సందర్భంగా ప్రతి డిజిటల్ సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకున్నామని, వీటిని కొన్ని రోజులపాటు పరిశీలిస్తామని ఐటీ అధికారులు చెప్పారు. కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గళమెత్తినా వారి ఇళ్ళు, ఆఫీసులపై ఇలా ఐటీ దాడులు జరగడం సాధారణమై పోయిందని మహారాష్ట్రలో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వాన్ని విమర్శించేవారిని ఐటీ, సీబీఐ, ఈడీ దాడులతో భయపెట్టజూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రైతుల నిరసనను సమర్థించినందుకు తాప్సి పొన్ను ఇంటిమీద, నాటి సీఏఏకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు కశ్యప్ నివాసంపైన ఈ దాడులు జరిగినట్టు భావిస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :
Bigg Boss Season 5 : బిగ్ బాస్ సీజన్ 5.. రేసులో ఉన్న కంటెస్టెంట్లు వీరే.. వివరాలు ఇవే..!