కరాచీ బేకరీని క్లోజ్ చేసిన యాజమాన్యం.. క్రెడిట్ మాదే అంటున్న అధికార పార్టీ
కరాచీ బేకరీ మూతపడింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బేకరీ కరాచీ క్లోజ్ అయ్యింది. అయితే బేకరీ తమ వల్లే మూసేశారని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన..
Karachi Bakery closed: కరాచీ బేకరీ మూతపడింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బేకరీ కరాచీ క్లోజ్ అయ్యింది. అయితే బేకరీ తమ వల్లే మూసేశారని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అంటుండగా .. లీజు గడువు ముగియడం వల్లే మూసివేయాల్సి వచ్చిందని బేకరీ మేనేజర్ రామేశ్వర్ వాగ్‌మరే ప్రకటించారు. పాకిస్తాన్‌లోని ప్రముఖ నగరమైన కరాచీ పేరు ఈ బేకరీకి ఉండటంపై ఎంఎన్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ బేకరీని మూసేయాలని ఆందోళన చేసింది. ఇప్పుడు తమ ఆందోళన వల్లే ఈ బేకరీ మూత పడిందని ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్ హజీ సైఫ్ షేక్ ట్వీట్ చేశారు.
అయితే లీజు ఒప్పందం ముగిసిందని, కొత్తగా లీజుకు ఇవ్వాలంటే ఓనర్ భారీ మొత్తం డిమాండ్ చేస్తుండటంతో అది ఇష్టం లేకే బేకరీని మూసేశామని మేనేజర్ రామేశ్వర్ వాగ్‌మరే వెల్లడించారు.
ఇప్పటికే గతేడాది లాక్‌డౌన్ వల్ల బిజినెస్ చాలా దెబ్బతిన్నదని ఆయన పేర్కొన్నారు. తమ బేకరీ పేరు మార్చాల్సిన అవసరం లేదని అన్నారు. తమది లైసెన్స్ ఉన్న చట్టబద్ధమైన బిజినెస్ అని వాగ్‌మరే తెలిపారు. ఈ బేకరీ మూతపడటంతో ఆయనతోపాటు ఇతర ఉద్యోగులు కూడా ఇప్పుడు నిరుద్యోగులుగా రోడ్డున పడ్డారు.
ఇవి కూడా చదవండి:
క్రాక్, ఉప్పెన విజయాలతో టాలీవుడ్‌కు జోష్.. మార్చిలో భారీగా విడుదల కానున్న సినిమాలు.. లిస్ట్ ఇదిగో
ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు