టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో భారీగా ఎగిసిపడ్డ మంటలు.. ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి..

Similipal Forest Reserve: ఒడిశాలోని సిమ్లిపాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. రాష్ట్రంలోని మయూరభంజ్‌ జిల్లాలో ఉన్న ఈ ఫారెస్ట్‌లో వారం క్రితం చెలరేగిన మంటలు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. ఈ జాతీయ ఉద్యానవనంలో మంటలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాపించాయని..

టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో భారీగా ఎగిసిపడ్డ మంటలు.. ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి..
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 04, 2021 | 5:26 PM

Similipal Tiger Reserve: ఒడిశాలోని సిమ్లిపాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. రాష్ట్రంలోని మయూరభంజ్‌ జిల్లాలో ఉన్న ఈ ఫారెస్ట్‌లో వారం క్రితం చెలరేగిన మంటలు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. ఈ జాతీయ ఉద్యానవనంలో మంటలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాపించాయని అధికారులు చెబుతున్నారు. ఫారెస్ట్‌లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఆనందపూర్‌, ఖండాచిరా, బాలినల్‌ కొండలకు మంటలు వ్యాపించాయి. ఇదిలా ఉంటే ఈ అగ్నిప్రమాదంలో ఎంత వరకు ప్రాణ నష్టం జరిగిందన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం మంటలు అదుపులోకి వస్తున్నాయని అధికారులు చెప్పారు.

ముఖ్యమంత్రి ఆదేశం..

సిమ్లిపాల్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సిమ్లిపాల్‌ అటవీ ప్రాంతం జాతికి విలువైన ఆస్తిగా అభివర్ణించారు. అటవీ సంరక్షణకు భరోసా కల్పించాని, ఇలాంటి దుర్ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంచలనం సృష్టించిన ట్వీట్‌..

ఈ అగ్నిప్రమాదం విషయమై మయూర్‌భంజ్‌ రాజకుటుంబానికి చెందిన యువరాణి అక్షిత ఎం. భంజ్‌ డియో చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. మార్చిన 1న ఆమె చేసిన ట్వీట్‌ తర్వాతే ఈ అగ్నిప్రమాదంపై చర్చ మొదలైంది. ఇంతకీ తను ఏమని ట్వీట్‌ చేసిందంటే.. గత వారం రోజుల క్రితం మయూర్‌భంజ్‌లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. వారం క్రితం 50 కిలోల దంతాలు దొరికాయి, అంతేకాకుండా కొన్ని నెలల కిత్రం కొందరు యువకులు.. అడవిలో ఇసుక, కలప అక్రమ రవాణ జరుగుతుందని తెలిపారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద అడవీలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన వార్తలను రాష్ట్రంలోని మీడియా తప్ప.. జాతీయ మీడియా కవర్‌ చేయలేదు’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. ఆమె చేసిన ట్వీట్‌ తర్వాతే అధికార, రాజకీయ యంత్రాంగం కదలడం మొదలైంది. మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రకాష్‌ జవదేకర్‌ ఈ విషయంపై దృష్టిసారించి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Also Read: ‘తప్పు చేశా, తప్పు చేశా’, చెవులు పట్టుకుని గుంజీలు తీసిన మాజీ టీఎంసీ నేత

UPSC Prelims Notification: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష తేదీని ప్రకటించిన యూపీఎస్సీ