‘తప్పు చేశా, తప్పు చేశా’, చెవులు పట్టుకుని గుంజీలు తీసిన మాజీ టీఎంసీ నేత

బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో  దాదాపు రోజుకో రకం వింతలు, విడ్డూరాలలోకిక కొదవ  లేదు. ఆ కోవలోదే ఇది ! తృణమూల్ l కాంగ్రెస్ లో చాలాకాలం పాటు కొనసాగి....

'తప్పు చేశా, తప్పు చేశా', చెవులు పట్టుకుని గుంజీలు తీసిన మాజీ టీఎంసీ నేత
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 04, 2021 | 5:07 PM

బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో  దాదాపు రోజుకో రకం వింతలు, విడ్డూరాలలోకిక కొదవ  లేదు. ఆ కోవలోదే ఇది ! తృణమూల్ l కాంగ్రెస్ లో చాలాకాలం పాటు కొనసాగి..బుధవారం బీజేపీలో చేరిన  సుశాంత్ పాటిల్ అనే ఆయన ..తాను చేసిన’పాపానికి ప్రాయశ్చిత్తంగా’ తన చెవులు రెండూ పట్టుకుని గుంజీలు తీసి అందర్నీ ఆశ్చర్య పరిచారు. బీజేపీ నేత సువెందు అధికారి, ఇతరులు పాల్గొన్న కార్యక్రమంలో ఆయన స్టేజీపైనే ఇలా చేసి వార్తలకెక్కారు.  మెడిన్ పూర్ లోని పింగ్లా ర్యాలీ సందర్భంగా ఈ విచిత్ర ‘సంఘటన’ జరిగింది.   తాను 2005 నించి టీఎంసీలో ఉంటూ పార్టీకి ఎంతో సేవ చేస్తూ వచ్చానని, కానీ పార్టీలో తన సేవలను ఎవరూ గుర్తించలేదని సుశాంత్ పాటిల్ తెలిపారు.   తృణమూల్ కాంగ్రెస్ కే ఓటు వేయాలని ఓటర్లను కోరి పెద్ద తప్పు చేశానని , ఇప్పుడు ఇలా చెవులు పట్టుకుని, గుంజీలు తీయడంద్వారా తన ‘పాప’ ప్రక్షాళన జరిగిందని ఆయన అన్నారు. ప్రస్తుతం తనకెంతో స్వేఛ్చ లభించిందన్నారు. ఆయన ఇలా గుంజీలు తీస్తుంటే సువెందు అధికారి, ఇతర నేతలు వారించకుండా చూస్తూ ఉండిపోయారు.

అటు-సుశాంత్ పాటిల్ ని నాలుగేళ్ల క్రితమే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు జిల్లా బీజేపీ అధ్యక్షుడు అజిత్ మైతీ తెలిపారు. ఆయన బీజేపీలో చేరుతారని  తాము ముందే ఊహించామన్నారు.  ‘బీజేపీ సంస్కృతే అది..కొందరు కాళ్ళు పట్టుకుని ఆ పార్టీలో చేరితే మరి కొందరు ఇలా గుంజీలు తీస్తూ చేరుతారు’ అని అజిత్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎంతమంది టీఎంసీని వీడినా తమ పార్టీకి నష్టం లేదన్నారు. కాగా బెంగాల్ ఎన్నికలకోసం అప్పుడే బీజేపీ తన వ్యూహరచన ప్రారంభించింది. నిన్న పార్టీ కొర్ కమిటీ భేటీ కాగా- గురువారం పార్టీ ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. త్వరలో బెంగాల్ ఎన్నికల తొలి, రెండో దశ ఎన్నికలకు  పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశముంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

India vs England 4th Test Live: అయ్యో అప్పుడే…! తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..

ITIR Controversy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాకరేపుతున్న ఐటీఐఆర్.. ఎవరి వాదన ఎలా వున్నా.. ఇప్పటి వరకు జరిగిందిదే!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..