AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది

ఇకపై డబ్బులు కావాలంటే బయటకు వెళ్లాల్సిన టెన్షన్ అవసరం లేదు. జస్ట్ ఒక మెసేజ్ లేదా కాల్ చేస్తే సరిపోతుంది. ఏటీఎం వ్యాన్ మీ ఇంటికే వచ్చేస్తుంది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్..

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 24, 2020 | 1:55 PM

Share

ఇకపై డబ్బులు కావాలంటే బయటకు వెళ్లాల్సిన టెన్షన్ అవసరం లేదు. జస్ట్ ఒక మెసేజ్ లేదా కాల్ చేస్తే సరిపోతుంది. ఏటీఎం వ్యాన్ మీ ఇంటికే వచ్చేస్తుంది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జస్ట్ వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే చాలు.. ఏటీఎం మీ ఇంటికి వస్తుంది అని ప్రకటించింది. కస్టమర్ల డోర్ స్టెప్ ఏటీఎం సర్వీస్ ప్రారంభించింది అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థ ఎస్‌డీఐ. ఎస్బీఐ ఖాతాదారులు 70529 11911 లేదా 77605 29264 నెంబర్లకు ఫోన్ చేయడం లేదా ఇదే నెంబర్లకు వాట్సాప్‌లో మెసేజ్ చేసినా సరిపోతుంది. మీరు కోరుకున్న చోటుకు ఏటీఎంను పంపిస్తామని వెల్లడించింది. అలాగే కస్టమర్లు కోరుకున్న సమయానికే ఇంటికి మొబైల్ ఏటీఎం వస్తుంది.

అయితే ప్రస్తుతం ఈ సర్వీసులు దేశ వ్యాప్తంగా ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం లక్నోలో మాత్రం ప్రయోగాత్మకంగా ఎస్బీఐ డోర్‌ స్టెప్ ఏటీఎం సర్వీస్‌ను ప్రారంభించింది. ఇది సక్సెస్ అయితే ఇతర ప్రాంతాల్లోనూ ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నారు. 70 ఏళ్ల పైబడ్డ వ‌ృద్ధులు, దివ్యాంగులు, ఇంటికే పరిమితమైన రోగులు, అంధుల కోసం ఈ సర్వీస్‌ను తీసుకొచ్చింది. నగదు ఉప సంహరణతో పాటు నగదు జమ, చెక్, ఫామ్15 హెచ్, కేవైసీ డాక్యుమెంట్, టర్మ్ డిపాజిట్, లైఫ్ సర్టిఫికేట్ లాంటివి బ్యాంకులో సబ్మిట్ చేయవచ్చు. కాగా బ్యాంకుకు ఐదు కిలో మీటర్ల పరిధిలో ఉన్న కస్టమర్లకు మాత్రమే ఈ సదుపాయం ఉండగా, ఈ లావాదేవీలకు అదనపు ఛార్జీలు వసూలు చేయనుంది ఎస్బీఐ.

Read More:

నిరుద్యోగుల కోసం గూగుల్ ఉపాధి కోర్సులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి.. 2.35 కోట్లకి చేరిన కేసులు

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!