‘ఇక బాధ్యతలు మోయలేను, నాన్-గాంధీ చీఫ్ ను ఎన్నుకోండి,’ సోనియా

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్ష పదవికి రాజీనామా చేయకముందు సోనియా..ఇక తాను ఈ బాధ్యతలు మోయలేనని, తన స్థానే మరొకరిని ఎన్నుకునే ప్రక్రియను మొదలుపెట్టాలని తన సన్నిహితులవద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

'ఇక బాధ్యతలు మోయలేను, నాన్-గాంధీ చీఫ్ ను ఎన్నుకోండి,' సోనియా
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 24, 2020 | 1:00 PM

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్ష పదవికి రాజీనామా చేయకముందు సోనియా..ఇక తాను ఈ బాధ్యతలు మోయలేనని, తన స్థానే మరొకరిని ఎన్నుకునే ప్రక్రియను మొదలుపెట్టాలని తన సన్నిహితులవద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది.  గత ఏడాది తన కుమారుడు రాహుల్ గాంధీ పదవికి రాజీనామా చేసిన అనంతరం, తాత్కాలిక అధ్యక్షురాలిగా పదవిని చేపట్టానని, గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరొకరినెవరినైనా ఎన్నుకోవాలని ఆమె వారికి సూచించినట్టు సమాచారం. ఒకవేళ రాహుల్ తిరిగి అధ్యక్ష పదవిని చేపట్టేందుకు నిరాకరిస్తే గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తిని ఏకాభిప్రాయం ద్వారానో, ఎన్నిక ద్వారానో ఎన్నుకోవచ్ఛునని తెలుస్తోంది. తాత్కాలిక అధ్యక్షునిగా రాహుల్ పదవి చేపట్టే అవకాశాలు దాదాపు లేనట్టేఅని తెలుస్తోంది. అటు. ఇదంతా.. ఈ లేఖ వ్యవహారం బీజేపీ పన్నిన కుట్రగా రాహుల్ పేర్కొన్నారు. సమయం చూసి ఈ లేఖను విడుదల చేశారని ఆయన వ్యాఖ్యానించినట్టు  సమాచారం.

పార్టీ సీనియర్ నేతలు ఈ నెల 7 నే ఈ లేఖ రాస్తే ఇప్పుడు అది  బయటపడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీన్ని వారు కావాలనే లీక్ చేశారని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపిస్తున్నారు.