Goat Milk: లీటరు రూ.50 ఉండే మేకపాలు… రూ.1500 పెట్టినా దొరకట్లేదు.. ఎందుకంటే…?

ఏదైనా సరే  అవసరం ఎక్కువ ఉంటే.. దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో మేకపాలకు ఓ రేంజ్‌లో ధర పెరిగింది. పెరిగిన ధర ఎంతో తెలిస్తే మీరు షాక్ తింటారు.

Goat Milk: లీటరు రూ.50 ఉండే మేకపాలు... రూ.1500 పెట్టినా దొరకట్లేదు.. ఎందుకంటే...?
Goat Milk
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 15, 2021 | 2:31 PM

ఏదైనా సరే  అవసరం ఎక్కువ ఉంటే.. దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో మేకపాలకు ఓ రేంజ్‌లో ధర పెరిగింది. పెరిగిన ధర ఎంతో తెలిస్తే మీరు షాక్ తింటారు. సాధారణంగా ఒక లీటరు మేక పాల ధర రూ .50  ఉంటుంది, కానీ ఇప్పుడు అదే  లీటరు పాలను రూ .1500 కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. ఇంత భారీగా మేక పాలు ధర పెరగడానికి కారణం ఏంటని అనుకుంటున్నారా..?. డెంగ్యూ. అవును ఉత్తరప్రదేశ్‌ డెంగ్యూ విజృంభించింది. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు విడిచారు. డెంగ్యూ ముఖ్యంగా ప్లేట్‌లెట్స్ కౌంట్‌ను తగ్గించి.. రోగులును ఇబ్బందులకు గురిచేస్తోంది. కాగా మేకపాలు సేవించడం ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుందని ప్రచారం జరగడంతో.. అక్కడ వ్యాధిగ్రస్తులు మేకపాల కోసం క్యూ కట్టారు. దీంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.

“గత నెలలో డెంగ్యూ వ్యాప్తి చెందినప్పటి నుండి ప్రజలు మేక పాలు కోసం నన్ను సంప్రదిస్తున్నారు. నేను పాలను సాధారణంగా లీటర్ రూ .50 కి విక్రయిస్తాను. డిమాండ్ పెరగడంతో ధర రూ .1500 కి పెరిగింది” అని సదర్ బాదర్ సమీపంలో నివశించే ఒక పాల విక్రేత చెప్పారు.  స్థానిక ఆయుర్వేద వైద్యులు మేకపాల ద్వారా ప్లేట్‌లెట్లు పెరుగుతాయని చెప్పడంతో రోగులు ఓ రేంజ్‌లో ఎగబడ్డారు. అయితే, మేక పాలు ప్లేట్‌లెట్ కౌంట్ పెంచడంలో లేదా డెంగ్యూ చికిత్సలో సహాయపడుతుంది అనడానికి ఎటువంటి శాస్త్రీయ రుజువు లేదని డాక్టర్లు చెబుతున్నారు. మేకపాలు తాగితే డెంగీ జ్వరం నయం అవుతుందని కూడా ఎక్కడా వైద్యపరంగా నిరూపణ కాలేదంటున్నారు.

Also Read: రంగంలోకి నేరుగా డీజీపీ.. 70 టీమ్స్ ఏర్పాటు.. తెలివిగా తప్పించుకుంటున్న నిందితుడు

కాసేపట్లో సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్ కళ్యాణ్..

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!