AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saidabad rape case: రంగంలోకి నేరుగా డీజీపీ… 70 టీమ్స్ ఏర్పాటు.. తెలివిగా తప్పించుకుంటున్న నిందితుడు

నిందితుడు రాజు ఫోన్ ఉపయోగించకపోవడం పోలీసుల గాలింపునకు ఆటంకంగా మారింది. ఒకవేళ రాజు సెల్​ఫోన్ వినియోగిస్తూ.. ఉంటే టెక్నాలజీ ఆధారంగా పోలీసులు ఆచూకీని వెంటనే గుర్తించేవారు.

Saidabad rape case: రంగంలోకి నేరుగా డీజీపీ... 70 టీమ్స్ ఏర్పాటు.. తెలివిగా తప్పించుకుంటున్న నిందితుడు
Saidabad Rape And Murder Case
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 15, 2021 | 2:33 PM

సింగరేణి కాలనీలో బాలికపై అత్యాచారం, హత్య కేసు నిందితుడి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఈ కేసును డీజీపీ నేరుగా పరిశీలిస్తున్నారు. డీజీపీ కార్యాలయం నుంచి అన్ని స్టేషన్లకు నిందితుడి సమాచారాన్ని చేరవేశారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నిందితుడ్ని పట్టుకునేందుకు మొత్తం 70 టీమ్స్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. వెయ్యి మంది పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు రాజు సెల్‌ఫోన్ వాడకపోవడంతో అతడ్ని పట్టుకోవడం కష్టతరంగా మారింది. పోలీసులు.. సీసీ కెమెరాలపైనే ఫోకస్ పెట్టారు. వందల కొద్దీ సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాల్లో ఆనవాలు దొరకకుండా రాజు తప్పించుకుతిరగడం పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. తలకు ఎర్రటి టవల్ కట్టుకుని రాజు జుట్టును కవర్ చేస్తున్నాడు. చిన్ వద్ద గడ్డం కనిపించకుండా మాస్క్ తో కవర్ చేస్తున్నాడు. టాస్క్ ఫోర్స్ డీసీపీ , ఈస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.  ఇప్పటికే రాజు ఆచూకీ తెలిపినవారికి 10 లక్షలు రివార్డ్ ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. నగరంలోని కల్లు, మద్యం దుకాణాలు, లేబర్ అడ్డాల్లో గాలిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతంలో రాజు తలదాచుకున్నట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. అతి త్వరలో రాజును పట్టుకోవాలని సంకల్పించారు. మేనత్త కుమార్తె మౌనికను రాజు ప్రేమించి పెళ్లి చేసుకోగా.. వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. నిందితుడు రాజు గత కొన్ని నెలలుగా ఒంటరిగా ఉంటున్నాడు.

ఘటన అనంతరం పని చేసిన కాంట్రాక్టర్ వద్దకు వెళ్లిన రాజు.. గతంలో పని చేసినందుకు రావాల్సిన రూ.1800 తీసుకుని వెళ్లిపోయాడు. ఊరికి వెళుతున్నానని కాంట్రాక్టర్​కి చెప్పి వెళ్లాడు. తన వద్ద ఉన్న ఫోన్​ ఆఫ్ చేసి పడేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read:మూత్రం పోసేందుకు టాయ్‌లెట్‌కి వెళ్తున్న ఆవులు.. కొందరు మనుషులు వాటిని చూసి నేర్చుకోవాలి

ఎవర్‌గ్రీన్ బ్యూటీ రమ్యకృష్ణ గురించి ఆసక్తికర విషయాలు