AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెల్లూరులో దారుణం.. యువతిపై విచక్షణా రహితంగా దాడి.. బ్రతిమిలాడినా కనికరించని వైనం

దేశంలో మహిళపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. యువతులపై దాడులను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినా.. కొందరు నీచులు ఇష్టానుసారంగా..

నెల్లూరులో దారుణం.. యువతిపై విచక్షణా రహితంగా దాడి.. బ్రతిమిలాడినా కనికరించని వైనం
Subhash Goud
|

Updated on: Sep 15, 2021 | 11:57 AM

Share

దేశంలో మహిళపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. యువతులపై దాడులను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినా.. కొందరు నీచులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్నారు. వికృత చేష్టలకు దిగుతున్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠినమైన చట్టాలు ఉన్నా.. ఏ మాత్రం భయపడకుండా నీచానికి దిగుతున్నారు. తాజాగా నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. మరో వ్యక్తితో  వ్యభిచారానికి  పాల్పడాలని ఒత్తిడి తీసుకువస్తూ కర్రతో కొడుతూ వీడియోను తీయించాడు. మరో వ్యక్తి ఈ వీడియోను తీస్తూ పైశాచిక ఆనందంగా పొందాడు. వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.

యువతిని కర్రతో కొట్టడంతో చేతి రాజులు పగిలి రక్తం కారుతున్నా.. ఆ మానవ మృగాడు ఏ మాత్రం కనికరించలేదు. తమ వాళ్లు చూస్తే బాధపడతారని బాధితురాలు ప్రాధేయపడుతున్నా.. ఆ వ్యక్తి మాత్రం కర్రతోకొట్టడం ఆపలేదు. కర్రతో కొట్టకుండా అడ్డుకుంటే దుస్తులు చించివేస్తానని యువతిని బెదిరించాడు. తన దుస్తులు చించివేయవద్దని కోరినా వినలేదు. నీకు నిన్న ఏం చెప్పాను.. నువ్వు ఏం చేశావు.. అంటూ ఆ వ్యక్తి యువతిపై కర్రతో ఇష్టానుసారంగా దాడికి దిగాడు. చివరికి ఈ వీడియో పోలీసులకు చేరినట్లు తెలుస్తోంది. యువతిపై దాడి చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

కాగా, ఇలా దారుణంలో రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నాయి. పోలీసులు చర్యలు చేపట్టి కటకటాల వెనక్కి నెట్టినా.. మానవ మృగాళ్లలో తీరు మారడం లేదు. ఇలాంటి దాడులకు దిగుతున్న యువకులపై పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి: Robbery: నెల్లూరు నగరంలో వెరైటీ చోరీ.. మాట్లాడూతూనే మాయం చేసేశాడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Humanity: ఆస్థి రాయించుకుని 90ఏళ్ల తల్లిని అనాథగా వదిలేసిన నలుగురు కూతుళ్లు.. కలెక్టర్‌ను ఆశ్రయించిన వృద్ధురాలు

LLB పూర్తి చేసి రూ.3 వేల పెట్టుబడితో వ్యాపారం.. నేడు రూ.6 లక్షలు
LLB పూర్తి చేసి రూ.3 వేల పెట్టుబడితో వ్యాపారం.. నేడు రూ.6 లక్షలు
మేరా భారత్ మహాన్.. సముద్ర లోతుల్లో ఇస్రో సాహస ప్రయోగం..
మేరా భారత్ మహాన్.. సముద్ర లోతుల్లో ఇస్రో సాహస ప్రయోగం..
సరిగ్గా నేటికి 46 ఏళ్లు..పాక్ కు చుక్కలు చూపించిన భారత దిగ్గజాలు
సరిగ్గా నేటికి 46 ఏళ్లు..పాక్ కు చుక్కలు చూపించిన భారత దిగ్గజాలు
'ఇకపై బడి పిల్లలు షూ బదులు చెప్పులు ధరించాలి'.. ప్రభుత్వం ప్రకటన
'ఇకపై బడి పిల్లలు షూ బదులు చెప్పులు ధరించాలి'.. ప్రభుత్వం ప్రకటన
ముంబైలో కాలి బూడిదైన జగిత్యాల బస్సు!
ముంబైలో కాలి బూడిదైన జగిత్యాల బస్సు!
దారులన్నీ మేడారం వైపే.. అలా చేస్తే ఇట్టే పసిగడతారు..
దారులన్నీ మేడారం వైపే.. అలా చేస్తే ఇట్టే పసిగడతారు..
హార్దిక్ మెసేజ్‎కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కళ్లలో ఆనంద బాష్పాలు
హార్దిక్ మెసేజ్‎కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కళ్లలో ఆనంద బాష్పాలు
ఆదివారం సెలవు రద్దు.. ఆ రోజు తెరిచే ఉంటుంది? కీలక నిర్ణయం..!
ఆదివారం సెలవు రద్దు.. ఆ రోజు తెరిచే ఉంటుంది? కీలక నిర్ణయం..!
ఖర్చు లేని మ్యాజిక్.. బియ్యం నీటితో ఇన్ని ప్రయోజనాలా...?
ఖర్చు లేని మ్యాజిక్.. బియ్యం నీటితో ఇన్ని ప్రయోజనాలా...?
అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఊహించని స్పందన
అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఊహించని స్పందన