AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cows toilet: మూత్రం పోసేందుకు టాయ్‌లెట్‌కి వెళ్తున్న ఆవులు… కొందరు మనుషులు వాటిని చూసి నేర్చుకోవాలి

జర్మనీ సైంటిస్టులు చేసిన ఒక అధ్యయనంలో భాగంగా ఆవులు మరుగుదొడ్డికి వెళ్లే విధంగా ట్రైన్ చేశారు. ఆవులకు టాయ్‌లెట్‌ వెళ్లే విధానాన్ని నేర్పడం ద్వారా, గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను తగ్గించవచ్చని ఈ పరిశోధకులు వెల్లడించారు.

Cows toilet: మూత్రం పోసేందుకు టాయ్‌లెట్‌కి వెళ్తున్న ఆవులు... కొందరు మనుషులు వాటిని చూసి నేర్చుకోవాలి
Cows Toilet
Ram Naramaneni
|

Updated on: Sep 15, 2021 | 2:31 PM

Share

కొందరు సెన్స్ లేని మనుషుల మాదిరి ఆవులు ఎక్కడపడితే అక్కడ మూత్రం పోయడం లేదు. అవి కూడా క్రమశిక్షణ పాటిస్తున్నాయి. అవి మూత్రం పోసేందుకు టాయిలెట్ వినియోగిస్తున్నాయి. కాస్త విచిత్రంగా ఉన్నా ఇది పూర్తి నిజం. జర్మనీ సైంటిస్టులు చేసిన ఒక అధ్యయనంలో భాగంగా ఆవులను మరుగుదొడ్డికి వెళ్లే విధంగా ట్రైన్ చేశారు. ఆవులకు టాయ్‌లెట్‌ వెళ్లే విధానాన్ని నేర్పడం ద్వారా, గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను తగ్గించవచ్చని ఈ పరిశోధకులు వెల్లడించారు. ఆవులకు నిర్దేశించిన మరుగుదొడ్డిని ఉపయోగించేలా జర్మనీలో జరిపిన అధ్యయనంలో సైంటిస్టులు ఇచ్చారు. ఆవుల యూరిన్ నుంచి వచ్చే అమ్మోనియా మట్టితో కలిసినప్పుడు గ్రీన్‌హౌస్‌ వాయువు నైట్రస్ ఆక్సైడ్‌గా మారుతుంది. వరల్డ్‌వైడ్‌గా మానవ కార్యకలాపాలకు సంబంధించి గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలలో 10శాతం పశువుల నుంచే వస్తుంది. దీంతో జర్మనీలోని పరిశోధకులు ఈ కొత్త ప్రయోగానికి నాంది పలికారు.  రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫార్మ్ యానిమల్ బయాలజీకి చెందిన ఫార్మ్‌లో సైంటిస్టులు 16 ఆవులకు టాయ్‌లెట్‌‌ను ఉపయోగించడం నేర్పించారు. ఈ టాయ్‌లెట్స్‌కు “మూలూ” అని నేమ్ పెట్టారు. ఈ పరిశోధనలో భాగంగా మొదట ఆవులను మూలూ దొడ్డిలో ఉంచారు. అక్కడ మూత్ర విసర్జన చేసిన ప్రతిసారీ వాటికి ఆహారం అందించారు. తర్వాత, వారు మూలూ పక్కన ఉన్న ప్రాంతంలో ఆవులను ఉంచారు. మరుగుదొడ్డిలోకి వెళ్లి మూత్ర విసర్జన చేసినందుకు మళ్లీ ఆహారాన్ని అందజేశారు.

మూలూ వెలుపల మూత్ర విసర్జన చేసిన ఆవులకు శిక్షగా మూడు సెకన్ల పాటు వాటిపై నీటిని చల్లారు. ట్రైనింగ్ మూడవ దశలో భాగంగా, టాయిలెట్ నుంచి దూరాన్ని పెంచారు. రివార్డులు, శిక్షలు కొనసాగించారు. 10 ట్రైనింగ్ సెషన్‌లు ముగిసే సమయానికి, 11 ఆవులు సక్సెస్‌ఫుల్‌గా టాయిలెట్ ఉపయోగించడంలో ట్రైనింగ్ పొందినట్లు సైంటిస్టులు గుర్తించారు. 15 నుంచి 20 మూత్ర విసర్జనలు చేసే సమయానికి ముందే, ఆవులు టాయ్‌లెట్‌లోకి వెళ్లడాన్ని ప్రారంభించాయి అని అధ్యయనంలో పాల్గొన్న లిండ్సే మాథ్యూస్ తెలిపారు. మూలూ వంటి మోడల్‌లో, 80శాతం పశువుల మూత్రాన్ని గ్రహించడం వలన అమ్మోనియా ఉద్గారాలు 56శాతం తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

Also Read: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక ఉత్తర్వులు జారీ

ఎవర్‌గ్రీన్ బ్యూటీ రమ్యకృష్ణ గురించి ఆసక్తికర విషయాలు

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!