Andhra Pradesh: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్… కీలక ఉత్తర్వులు జారీ

ఆర్టీసీలో ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసును రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. దీంతో రెండేళ్లుగా పదవీవిరమణలు నిలిచిపోయాయి. చాలా మంది ప్రమోషన్స్ పొందాల్సి ఉండగా...

Andhra Pradesh: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్... కీలక ఉత్తర్వులు జారీ
Apsrtc
Follow us

|

Updated on: Sep 15, 2021 | 2:32 PM

ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. సంస్థలో ప్రమోషన్స్ పండుగ ప్రారంభమైంది. పదోన్నతి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోన్న ఎంప్లాయిస్ కల నెరవేరుతోంది. అర్హత ఉన్న ఉద్యోగులందరికీ ఈనెలాఖరులోపు ప్రమోషన్స్ ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు ఆదేశాలిచ్చారు. ఈమేరకు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో అన్ని జిల్లాల్లోనూ అర్హుల జాబితా రూపొందించడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆర్టీసీలో ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసును రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. దీంతో రెండేళ్లుగా పదవీవిరమణలు నిలిచిపోయాయి. చాలా మంది ప్రమోషన్స్ పొందాల్సి ఉండగా ఖాళీలు లేకపోవడంతో పదోన్నతులు పొందలేకపోయారు. 60 ఏళ్ల సర్వీసు కంప్లీట్ చేసుకున్నవారు ఈనెలాఖరున రిటైర్ కాబోతున్నారు. దీంతో ఈనెలాఖరు నుంచి ఆర్టీసీలో ఉద్యోగుల పదవీవిరమణ ప్రక్రియ తిరిగి ప్రారంభం కాబోతోంది.

ఇకపై నెలకు 200 నుంచి 300 వరకు ఉద్యోగులు రిటైర్ అవ్వనున్నారు. దీంతో రూల్స్ అనుసరించి ఖాళీ అయిన స్థానాల్లో పలు పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రమోషన్స్ ఇచ్చే అంశంపై 2011, 2019లో ఆర్టీసీ యాజమాన్యం నిబంధనలు రూపొందించింది. 2019లో అప్పటి ఎండీ సురేంద్రబాబు నేతృత్వంలో  నిబంధనలు సవరించారు. వీటికి బోర్డులో గ్రీన్ సిగ్నల్ తీసుకుని ప్రమోషన్స్ చేపట్టాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం తొలిసారిగా పదోన్నతుల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరు లోపు కంప్లీట్ చేయాలన్న ఎండీ ఆదేశాల మేరకు వేగంగా మీద పేపర్స్ సిద్దమవుతున్నాయి. కండక్టర్లు, మెకానిక్ లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ డిపో మేనేజర్లు, కంట్రోలర్లు, గ్యారేజీ సూపర్ వైజర్లు, ట్రాపిక్ సూపర్ వైజర్లు తదితర ఉద్యోగులు ఎక్కువ మంది ప్రమోషన్స్ పొందే అవకాశాలున్నాయి. ప్రమోషన్స్ అనంతరం సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను అధికారులు గవర్నమెంట్‌కు నివేదించనున్నారు. అనంతరం ఖాళీగా ఉన్న పోస్టులను ఏపీపీఎస్సీ లేదా నేరుగా భర్తీపై సర్కార్ నిర్ణయం తీసుకుంటుంది.

Also Read: పాముల బాబోయ్ పాములు.. బడులు, గుడులు, హాస్పిటల్స్‌.. ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలు

నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలే ఉగ్రవాదుల టార్గెట్.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ అలర్ట్స్