Snakes: పాములు బాబోయ్ పాములు.. బడులు, గుడులు, హాస్పిటల్స్.. ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలు
తెలుగు రాష్ట్రాల్లో 5 అత్యంత విషపూరిత పాములు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి మనిషిని కాటు వేస్తే 3 గంటల్లో మనిషి మరణించే అవకాశం ఉంది.
పాములు బాబోయ్ పాములు. అవును ఇప్పుడు వర్షాకాలం కావడంతో ఎక్కడ చూసినా పాములే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పల్లెటూర్లలో అందునా కొనసీమ ప్రాంతాల్లో పాముల సంచారం అధికంగా ఉంది. వరదల ప్రభావంతో కోనసీమలో పెరిగిపోయిన పాముల సంచారం విపరీతంగా పెరిగిపోయింది. ఇళ్ళు, బడులు, గుడులు, హాస్పిటల్స్‌లలోకి చేరి పాములు జనాలకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పి.గన్నవరం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దూరిన భారీ నల్ల తాచుపాము అక్కడికి వచ్చిన సిబ్బందిని, రోగులను టెన్షన్ పెట్టించింది. పాము కనపడగానే జనాలు ఎటుపడితే అటు పరుగులు తీశారు. ఆసుపత్రి సిబ్బంది స్నాక్ కేచర్ దుర్గారావుకు సమాచారం ఇవ్వడంతో వచ్చి పామును బందించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కోనసీమలో వరదలు రావడంతో లంకల్లో, పొలాల్లో ఉండే పాములు ఇళ్లలోకి చేరి జనాలను భయపెడుతున్నాయి.
పాము కాటు అనంతరం ప్రథమ చికిత్స తప్పనిసరి
తెలుగు రాష్ట్రాల్లో 5 అత్యంత విషపూరిత పాములు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి మనిషిని కాటు వేస్తే 3 గంటల్లో మనిషి మరణించే అవకాశం ఉంది. ఐతే పాము కరిచిన వెంటనే ప్రథమ చికిత్స చేసి.. మూడు గంటల వ్యవధిలోనే తగిన ట్రీట్మెంట్ అందించగలిగితే.. కాటుకు గురైన వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. విష సర్పం కరిచినా రకరకాల కారణాలతో ఆలస్యం చేసి కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొంతమంది విషం లేని పాము కరిచినా కంగారుతో, భయంతో ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని.. మూడు అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి.
విష సర్పం కాటు వేస్తే… ఆ విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుండి గుండెకు , గుండె నుండి అన్ని శరీరభాగాలకు చేరుతుంది. ఇలా విషం అన్ని శరీరభాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది. ఆలోపు ట్రీట్మెంట్ అందించకుంటే.. ఇక ఆ మనిషి బతికే అవకాశాలు దాదాపు లేనట్లే.. అందుకనే విషపు పాము కరిచిన వెంటనే…. కాటుకు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకోని ఆ గాట్లలో ఓ గాటు దగ్గర పెట్టి రక్తాన్ని సిరంజ్ లోకి లాగాలి.. ఇలా చేస్తున్నప్పుడు మొదట వచ్చే రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది. అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం. ఇలా రెండు మూడు సార్లు రెండు గాట్ల వద్ద చేయాలి. ఇలా చేసిన అనంతరం మనిషి సృహలోకి వస్తాడు. తర్వాత డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లి తగిన చికిత్సనందించాలి.
Also Read: నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలే ఉగ్రవాదుల టార్గెట్.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ అలర్ట్స్