Talibans Rule: తమ పాలనలో నేరాలు చేస్తే విధించే శిక్షలను ప్రకటించారు తాలిబన్లు.. పనిష్మెంట్స్ ఇవీ..

ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. తమ పాలనలో నేరాలు చేస్తే విధించే శిక్షలను ప్రకటించారు తాలిబన్లు.

Talibans Rule: తమ పాలనలో నేరాలు చేస్తే విధించే శిక్షలను ప్రకటించారు తాలిబన్లు.. పనిష్మెంట్స్ ఇవీ..
Taliban
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 16, 2021 | 11:32 AM

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. తమ పాలనలో నేరాలు చేస్తే విధించే శిక్షలను ప్రకటించారు తాలిబన్లు. దొంగతనం చేసినట్టు రుజువైతే రెండు చేతులు నరికేస్తామని స్పష్టం చేశారు. స్వలింగ సంపర్కులకు రాళ్లతో కొట్టే చంపే శిక్షను అమలు చేస్తామన్నారు. అయితే నేరాలకు శిక్ష విధించే ముందు నలుగురు సాక్షులను విచారిస్తామని , ఒక్కరి సాక్షం ముగ్గురితో తేడాగా ఉంటే శిక్షను రద్దు చేస్తామని ప్రకటించారు. శిక్షలపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

మహిళలు మగవాళ్లు తోడుగా లేకుండా బయటకు వెళ్తే కొరడా దెబ్బలు తప్పవని హెచ్చరించారు. తాలిబన్ల అరాచకంతో ఆఫ్ఘన్‌ మహిళలు 20 ఏళ్ల కిందకు వెళ్లిపోయారు. కొట్లాడి సాధించుకున్న హక్కులను కోల్పోయినట్టు వాళ్లు బాధపడుతున్నారు. తాలిబన్లు ఏమాత్రం మారలేదని వాళ్లు తీరు రుజువు చేస్తోంది. లొంగిపోయిన ఆఫ్ఘన్‌ సైనికులను ఉరితీసి , వాళ్ల శవాల మీద కాల్పులు జరిపి తమ ఉన్మాదాన్ని నిరూపించుకుంటున్నారు. ఆఫ్ఘన్‌లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంపై డిప్యూటీ ప్రధాని ముల్లా బరాదర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు.

హక్కానీ వర్గంతో జరిగిన గొడవలో ఆయన గాయపడినట్టు తెలుస్తోంది. కాందహార్‌లో ఉన్న బరాదర్‌ ఇప్పటివరకు కూడా కాబూల్‌కు రాలేదు. డిప్యూటీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించలేదు. తాలిబన్లు హ్యాపీగా పవర్‌ను ఎంజాయ్‌ చేస్తుంటే సామాన్య ఆఫ్ఘన్‌ పౌరులు మాత్రం నరకయాతన అనుభవిస్తునట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక చెబుతోంది. అందుకే మానవతా ధృక్పథంతో ఆఫ్ఘనిస్తాన్‌కు ఐక్యరాజ్యసమితితో పాటు అమెరికా , కెనడా భారీ సాయాన్ని ప్రకటించాయి. ఆఫ్ఘనిస్తాన్‌కు సాయం చేస్తున్న దేశాలకు తాలిబన్లు కృతజ్ఞతలు తెలిపారు.

Read also: Priyanka Gandhi: బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రియాంక గాంధీ సలహాలు.. కాంగ్రెస్ కమిటీ తొలి భేటీలో అనూహ్య నిర్ణయాలు