Pawan Kalyan: కాసేపట్లో సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్ కళ్యాణ్..

Janardhan Veluru

Updated on: Sep 15, 2021 | 11:06 AM

హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి బస్తీలో దారుణ హత్యకు గురైన ఆరేళ్ళ చిన్నారి కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో పరామర్శించనున్నారు.

Pawan Kalyan: కాసేపట్లో సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్ కళ్యాణ్..
Pawan Kalyan

Follow us on

Hydearad Rape Case: హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి బస్తీలో దారుణ హత్యకు గురైన ఆరేళ్ళ చిన్నారి కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో పరామర్శించనున్నారు. స్వయంగా ఆయన వారి ఇంటికి చేరుకుని.. కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మరికొద్ది సేపట్లో జూబ్లీహిల్స్‌లో జనసేన కేంద్ర కార్యాలయం నుండి పవన్ కళ్యాణ్ అక్కడకు బయలుదేరి వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో జనసేన కార్యకర్తలు సైతం అక్కడకు భారీ సంఖ్యలో చేరుకునే అవకాశముంది. కామాంధుడైన రాజు చిన్నారిని అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి పారిపోవడం తెలిసిందే.  మంగళవారంనాడు సినీ నటుడు మంచు మనోజ్ కూడా సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించడం తెలిసిందే. అటు వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

ఇదిలా ఉండగా నిందితుడు రాజుకు సంబంధించిన సమాచారమిస్తే రూ.10 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. రాజు ఆచూకీ కోసం పోలీసుల వేట కొనసాగిస్తున్నారు. మొత్తం 70 టీమ్స్ నిందితుడి కోసం గాలిస్తున్నాయి. ఈ 70 టీమ్స్‌లో దాదాపు వెయ్యి మంది పోలీసులు ఉన్నారు.  నిందితుడు రాజు సెల్ ఫోన్ వాడకపోవడంతో అతని ఆచూకీ గుర్తించడం కష్టతరంగా మారుతోంది. దీంతో  సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వందల కొద్దీ సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ , ఈస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి గాలింపు కొనసాగిస్తున్నారు.

రాజును అరెస్టు చేసి ఎన్‌కౌంటర్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నిందితుడు రాజును తప్పనిసరిగా పట్టుకుని ఎన్‌కౌంటర్ చేస్తామని మంత్రి మల్లారెడ్డి మంగళవారంనాడు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

Also Read..

Tollywood Drug Case: ఈడీ అధికారుల ముందు హాజరైన ముమైత్ ఖాన్.. ప్రారంభమైన విచారణ..

నీటి గుంటలో ఎంచక్కా ఈత కొట్టేస్తున్న బుజ్జి కుక్క పిల్లలు.. మీ కళ్లను మీరే నమ్మలేరు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu