Ganesh Visarjan 2021: నేడు సుప్రీం కోర్టు ముందుకు హైదరాబాద్ గణేష్ నిమజ్జనం కేసు.. ఏం జరుగుతుందో మరి..!

Hyderabad Ganesh Visarjan: హుస్సేన్ సాగర్‌లో గణనాథుడి విగ్రహాల నిమజ్జనం వ్యవహారం ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు రానుంది. హుస్సేన్ సాగర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ..

Ganesh Visarjan 2021: నేడు సుప్రీం కోర్టు ముందుకు హైదరాబాద్ గణేష్ నిమజ్జనం కేసు.. ఏం జరుగుతుందో మరి..!
Supreme Court
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 15, 2021 | 11:17 AM

Hyderabad Ganesh Visarjan: హుస్సేన్ సాగర్‌లో గణనాథుడి విగ్రహాల నిమజ్జనం వ్యవహారం ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు రానుంది. హుస్సేన్ సాగర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఒక్క ఏడాదికి హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి మినహాయింపుని ఇవ్వాలంటూ అభ్యర్థించింది. ట్యాంక్ బండ్ మీదుగా నిమజ్జనం చేసేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్‌లో జీహెచ్ఎంసీ కోరింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది జీహెచ్ఎంసీ. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని జీహెచ్ఎంసీ తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరనున్నారు.

హుస్సేన్‌సాగర్‌తో పాటు చెరువుల్లో పర్యావరణహితమైన విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని, జీహెచ్ఎంసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హుస్సేన్ సాగర్‌లో పర్యావరణానికి హానీ కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ కలిగిన విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ ఆదేశించింది. అయితే, నిమజ్జనం సమయం సమీపిస్తున్న తరుణంలో హైకోర్టు ఇలా తీర్పునివ్వడంతో ప్రభుత్వం, జీహెచ్ఎంసీ షాక్ అయ్యింది. ఈ ఒక్క ఏడాదికి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి అనుమతివ్వాలంటూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రివ్యూ పిటిషన్‌ను సైతం హైకోర్టు కొట్టిపడేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందేనంటూ కుండబద్దలుకొట్టింది. తాము ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనంటూ తేల్చి చెప్పింది.

Also read:

డ్రగ్స్ డైరీలో నేడు ముమైత్ పేజీ.. ఈడీ ముందుకు నటి ముమైత్ ఖాన్..(లైవ్ వీడియో): Mumaith Khan in Tollywood Drugs Case Video.

Smartphone: మొబైల్‌ వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు.. కారణం ఏంటంటే..!

Pawan Kalyan: కాసేపట్లో సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్ కళ్యాణ్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే