Sucess Story: వ్యర్ధాలకు రూపం ఇస్తూ యూట్యూబ్ చూసి పాత డ్రమ్స్, టైర్స్‌తో ఫర్నిచర్ తయారీ.. నెలకు లక్షల్లో ఆదాయం

Surya Kala

Surya Kala |

Updated on: Sep 15, 2021 | 1:37 PM

Sucess Story: చదువుకు డబ్బు సంపాదించడానికి సంబంధంలేదని అనేక మంది రుజువు చేశారు. కొంతమంది ఉద్యోగం లేదు అవకాశం లేదంటూ అంటూ నిరాశతో బతికేస్తారు. మరికొందరు ఎదుటివారి మీద ఆధారపడి బతికేస్తారు...

Sucess Story: వ్యర్ధాలకు రూపం ఇస్తూ యూట్యూబ్ చూసి పాత డ్రమ్స్, టైర్స్‌తో ఫర్నిచర్ తయారీ..  నెలకు లక్షల్లో ఆదాయం
Pramod
Follow us

Sucess Story: చదువుకు డబ్బు సంపాదించడానికి సంబంధంలేదని అనేక మంది రుజువు చేశారు. కొంతమంది ఉద్యోగం లేదు అవకాశం లేదంటూ అంటూ నిరాశతో బతికేస్తారు. మరికొందరు ఎదుటివారి మీద ఆధారపడి బతికేస్తారు.. కానీ కొంతమంది తమ తెలివి తేటలకు పదును పెట్టి.. సరికొత్తగా ఆలోచిస్తూ.. మట్టిని సైతం మాణిక్యంగా మారుస్టార్. వ్యర్ధాలకు అర్ధాలను కల్పిస్తూ.. సమాజంలో తమకంటూ గుర్తింపు సొంతం చేసుకోవడమే కాదు.. ఆర్ధికంగా ఎదుగుతారు. మరికొందరికి ఉపాధినిస్తారు.  కొందరు సోషల్ మీడియాను సరదాగా ఎంజాయ్ చేయడానికి ఉపయోగిస్తూ.. కొంతమంది అదే సోషల్ మీడియా నుంచి అనేక కొత్త విషయాలను నేర్చుకుని సరికొత్త పంథాను సృష్టించుకుంటారు. అలాంటి యువకుల్లో ఒకరు మహారాష్ట్రకు చెందిన ఓ యువ మెకానికల్ ఇంజనీర్.  ప్రమోద్ సుసారె అనే ఓ మెకానిక‌ల్ ఇంజినీర్  కొత్తగా ఆలోచించి.. త‌న స్కిల్‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. ఎందుకూ పనిరని డ్రమ్ములు, టైర్లతో అద్భుతాలు సృష్టిస్తూ లక్షలను ఆర్జిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

మ‌హారాష్ట్రలోని అహ్మద్‌న‌గ‌ర్‌కు చెందిన ప్రమోద్  2015 లో మెకానిక‌ల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం పూణెలోని ఓ కంపెనీలో నెలకు రూ. 12 వేల జీతంతో మెయిన్‌టెనెన్స్ ఇంజనీర్‌గా జాయిన్ అయ్యాడు.  ఆ జీతంలో ఇంటికి 5 వేలు పంపించేవాడు.. ఇక మిగిలిన డబ్బులతో ఆ మహానగరంలో జీవించేవాడు. అయితే ప్రమోద్ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన 2017లో  చోటు చేసుకుంది. 2017లో బిజినెస్ పనిమీద  చైనాకు వెళ్ళాడు. అక్కడ కొంద‌రు వ్యక్తులు పాడైపోయిన డ్రమ్స్‌, టైర్లు, ఇత‌ర మెటిరియ‌ల్‌తో స‌రికొత్త ఫ‌ర్నీచ‌ర్‌ను త‌యారు చేయ‌డం చూశాడు. అప్పుడు ప్రమోద్ దృష్టి దీనిమీద పడింది. తాను కూడా భారత్ లో ఇటువంటి బిజినెస్ చేయొచ్చుకదా అనుకున్నాడు. భారత్ కు తిరిగి వచ్చిన వెంటనే రీసైకిలింగ్ పై దృష్టిపెట్టాడు. ఇలా డ్రమ్స్‌, టైర్లతో ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు ఉన్నారా అని ముందు ఎంక్వైరీ చేశాడు. అతి తక్కువమంది కనిపించడంతో.. వెంటనే తన ఆలోచనలను ఆచరణలో పెట్టాడు. పీ2ఎస్ ఇంట‌ర్నేష‌న‌ల్ అనే కంపెనీ స్థాపించాడు. పాత డ్రమ్ములు, టైర్లతో చేసిన ఫ‌ర్నీచ‌ర్‌ను అమ్మడం ప్రారంభించి ఇప్పటికే కోటి రూపాయలకు పైగా సంపాదించాడు. నెలకు ల‌క్షలు సంపాదిస్తున్నాడు. తన కంపెనీలో పనిచేయడానికి మరికొందరిని నియమించుకుని వారికీ ఉపాధినిస్తున్నాడు.

 ఫ‌ర్నీచ‌ర్ చేయ‌డం యూట్యూబ్ లో చూసి నేర్చుకున్న ప్రమోద్: 

డ్రమ్స్‌, టైర్ల తో ఫర్నిచర్ చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. దీంతో మొదట్లో ఫర్నిచర్ చేయడం కొంచెం కష్టంగా మారింది. దీంతో యూట్యూబ్ ని ఆశ్రయించాడు. అందులోని వీడియోలను చూస్తూ తన ఆలోచనలను యాడ్ చేస్తూ.. అందంగా ఫర్మిచర్ చేయడం నేర్చుకున్నాడు. ఒకసారి ప్రమోద్ బైక్ టైర్ పంక్చర్ అయితే.. వేయించ‌డానికి మెకానిక్ షాపున‌కు వెళ్ళాడు. అక్కడ షాప్ లో ప‌నికిరాని పాత టైర్లను ఏ ధరకు అమ్ముతారని మెకానిక్ ను అడిగాడు.  అతను రూ. 8 అని చెప్పాడు. తక్కువ ధరకు టైర్లు వస్తున్నాయి. వాటిని ఫర్నిచర్ గా మారిస్తే.. మంచి ధర పలుకుతుంది. ఇదేదో లాభ‌సాటి వ్యాపార‌మే అని భావించాడు. తన దగ్గర ఉన్న కొద్దీ మొత్తంతో బిజినెస్ స్టార్ట్ చేశాడు. సెప్టెంబ‌ర్ 2018లో పీ2ఎస్ ఇంట‌ర్నేష‌న‌ల్ అనే కంపెనీ మొదలు పెట్టాడు. అయితే రెండు నెలలు అయినా పక్క పీస్ కూడా అమ్ముకోలేదు. దీంతో  మళ్ళీ మార్కెట్ పై దృష్టి పెట్టిన ప్రమోద్.. రోడ్డు ప‌క్కన ఉండే జ్యూస్ స్టాళ్ల ద‌గ్గర‌, ఫుడ్ స్టాళ్ల ద‌గ్గర టైర్ల ఫ‌ర్నీచ‌ర్‌ను ప్రద‌ర్శించడం మొదలు పెట్టాడు.

ఆలా కొన్ని రోజుల ప్రదర్శన అనంతరం మొదటి ఆర్డర్ ను 2019 జనవరి లో అందుకున్నాడు. పూణెలోని ఓ కేఫ్ య‌జ‌మాని రూ. 50 వేల లతో మొదటి ఆర్డర్ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి ప్రమోద్ మళ్ళీ కస్టమర్ కోసం ఎదురుచూసే పరిస్థితి రాలేదు. ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. అలా ఆర్డర్లు పెర‌గ‌డంతో రెండేళ్లలోనే కోటీశ్వరుడు అయ్యాడు. నెలకు రూ.12 వేల జీతం తీసుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు నెలకు లక్షలనుసంపాదించే స్టేజ్ కు చేరుకున్నాడు.  ప్రస్తుతం ప్రమోద్ మహారాష్ట్రతో పాటు హ‌ర్యానా, పంజాబ్, బెంగ‌ళూరు, గోవా, చెన్నైవంటి మహానగరాల నుంచి కూడా ఆర్డర్స్ అందుకుంటున్నాడు.

Also Read: Heart Donation: తాను మరణిస్తూ మరొకరి గుండెచప్పుడుగా మారనున్న కానిస్టేబుల్.. గుండె తరలింపుకు రూట్ మ్యాప్ సిద్ధం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu