Himachal Apples: యాపిల్‌ పంట రైతుల కంట కన్నీరు.. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు

Himachal Apples: హిమాచల్‌ప్రదేశ్‌లో యాపిల్‌ రైతులు ఆందోళనలో ఉన్నారు. హోల్‌సేల్‌ మార్కెట్‌, మండిస్‌లో మునుపెన్నడు లేని విధంగా ఈ సీజన్‌లో రైతులను..

Himachal Apples: యాపిల్‌ పంట రైతుల కంట కన్నీరు.. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు
Follow us

|

Updated on: Sep 15, 2021 | 1:55 PM

Himachal Apples: హిమాచల్‌ప్రదేశ్‌లో యాపిల్‌ రైతులు ఆందోళనలో ఉన్నారు. హోల్‌సేల్‌ మార్కెట్‌, మండిస్‌లో మునుపెన్నడు లేని విధంగా ఈ సీజన్‌లో రైతులను కలవరపెడుతోంది. రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల మంది రైతులు ఇబ్బందులో పడిపోయారు. వీరిలో 80 శాతం మంది చిన్న, సన్నకారు రైతులున్నారు. మంచిరకమైన యాపిల్స్‌ 22కేజీల నుంచి 35 కేజీల బరువున్న బాక్స్‌లు ఒక్కొక్కటి రూ.400 నుంచి రూ.1200 వరకు విక్రయిస్తున్నారు. యాపిల్‌ పంట ఉత్పత్తిలో 50 శాతానికిపైగా ఇంకా మార్కెట్‌కు చేరుకోలేదు. యాపిల్‌ పిండించే ప్రాంతాలైన సిమ్లా, మండి, కుల్లులో భారీ వర్షం, వడగళ్ల వర్షం ఇతర కారణాల వల్ల పంట నష్టపోవడంతో యాపిల్‌ పండ్ల రంగు మారడం, యాపిల్‌ సైజు పెరగకపోవడం కారణంగా గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో యాపిల్‌ ధరలు తగ్గడానికి ఒక కారణమని చెబుతున్నారు రైతులు. రాష్ట్రంలో 40 మిలియన్లకుపైగా బాక్స్‌లను ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు.

దిగుమతి చేసుకున్న వివిధ పండ్ల తోటల యజమానులు సంక్షోభాన్ని అధిగమించి మంచి దిగుబడిని సాధించారు. ఇది రాష్ట్రంలోని కార్పొరేట్‌ సంస్థలకు ప్రత్యక్ష అమ్మకాల ద్వారా మంచి రేట్లను సాధించారు. కానీ హిమాచల్‌ యాపిల్స్‌ విషయంలో నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. యాపిల్‌కు గిట్టుబాటు ధర కల్పించాలని, కార్పొరేట్ల బహిరంగ దోపిడీని నిరోధించాలని డిమాండ్లు చేస్తూ రైతులు ఉద్యమం చేపట్టారు. ఈ ఏడాది అదానీ అగ్రి ఫ్రెష్‌ ఏ-గ్రేడ్‌ ప్రీమియం యాపిల్‌ రేటును కిలోకు రూ.72 గా నిర్ణయించింది. గతేడాది కిలోకు రూ.88 ఇచ్చారు. దీంతో చాలా మంది రైతులు నష్టపోతున్నారు. వీరితోపాటు టమోటాలు, బంగాళా దుంపలు, వెల్లుల్లి, కాలీఫ్లవర్‌తోపాటు ఇతర పంటలు పండించే రైతులు అన్ని పంటలకు ఎంఎస్‌పి చట్టపరమైన హామీని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవీ కూడా చదవండి: Ola Electric Scooter: భారత్‌లో ప్రారంభమైన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ కొనుగోళ్లు.. ఫీచర్స్‌, ధరల వివరాలు ఇలా..!

Smartphone: మొబైల్‌ వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు.. కారణం ఏంటంటే..!