7th Pay Commission: పండగ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు..!
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి తీసికబురు అందించనుంది కేంద్ర సర్కార్. ప్రధాన నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి తీసికబురు అందించనుంది కేంద్ర సర్కార్. ప్రధాన నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను మళ్లీ పెంచడానికి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2021 జులై 1 నుంచి కొత్త డీఏ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఉద్యోగుల డీఏ 17 శాతం ఉండగా.. ఇప్పుడు 11 శాతం పెరిగి మొత్తం 28 శాతం అయ్యింది. కరోనా కారణంగా 2020 జనవరి, 2021 జూన్ మధ్య రావాల్సిన మూడు డీఏలను నిలిపివేసిన కేంద్రం.. జులై 1 నుంచి మూడు డీఏలతో కలిపి కొత్త వేతనాలను అందిస్తోంది. దీంతో ఆగస్టులో కేంద్ర లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 7వ వేతన సంఘం కింద డీఏ పెంచడంతో ఎంతో మేలు జరిగింది.
తాజా నివేదికల ప్రకారం.. పండుగ సీజన్‌కు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పింది. గ్రాట్యుటీ, నగదు చెల్లింపులు, డియర్‌నెస్ అలవెన్సు(డీఏ)లను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వశాఖ సెప్టెంబరు 7న ఒక మెమొరాండం జారీ చేసింది. తాజా నివేదికల ప్రకారం చూస్తే.. డీఏ మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 50 లక్షల మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షలకుపైగా పెన్షనర్లు ఈ ప్ర యోజనం పొందనున్నారు.
రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గ్రాట్యుటీ, సెలవులకు బదులుగా చెల్లించే క్యాష్ పేమెంట్స్ అందుకుంటారని ఈ మెమొరాండం పేర్కొంది. జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు గ్రాట్యుటీకి సంబంధించిన సమాచారాన్ని ఇందులో విడుదల చేసింది. దీంతోపాటు 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు డీఏ విడుదల గురించి ప్రస్తావించింది. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్టర్లోనూ పేర్కొంది. జనవరి 2020 నుంచి జూన్ 2021 మధ్యకాలంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనాలు అందుతాయని ప్రకటించింది.
మార్గదర్శకాల ప్రకారం. నగర జనాభా 5 లక్షలు దాటితే వర్గాల వారీగా కేటగిరికి అప్‌గ్రేడ్ అవుతుంది. అక్కడి ఉద్యోగులకు 9 శాతం బదులుగా 18 శాతం హెచ్‌ఆర్‌ఏ మంజూరు చేస్తారు. ఇక మూడు కేటగిరిలకు కనీస ఇంటి అద్దె భత్యం రూ.5400, రూ.3600, రూ.1800. డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతం చేరుకున్నప్పుడు, హెచ్‌ఆర్‌ఏలో కూడా సవరిస్తారు.