AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tej Pratap Yadav: శివభక్తితో లాలూ తనయుడికి పూనకం.. వైరల్ అవుతున్న క్షీరాభిషేకం వీడియో..!

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శివలింగానికి అతుక్కుని జలాభిషేకం చేశారు తేజ్ ప్రతాప్.

Tej Pratap Yadav: శివభక్తితో లాలూ తనయుడికి పూనకం.. వైరల్ అవుతున్న క్షీరాభిషేకం వీడియో..!
Tej Pratap Yadav
Balaraju Goud
|

Updated on: Jul 09, 2024 | 1:39 PM

Share

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శివలింగానికి అతుక్కుని జలాభిషేకం చేశారు తేజ్ ప్రతాప్. సాధువులు చేస్తున్న ఈ సంప్రోక్షణలో ఆయన పూర్తిగా శివలింగానికి చుట్టేసుకున్నారు. దీంతో పెద్ద వివాదం రాజుకుంది. 1 నిమిషం 26 సెకన్ల నిడివి గల ఈ వీడియో తేజ్ ప్రతాప్ శివ భక్తిని చూపుతుందంటూ.. ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తేజ్ ప్రతాప్ ఇటీవల కాలంలో అనేక రూపాల్లో కనిపించి తెగ వార్తల్లో నిలిచారు. కొన్నిసార్లు వేణువు వాయిస్తూ, శంఖం పూరిస్తూ, మరికొన్నిసార్లు తన తలపై నెమలి ఈకలు, పసుపు ధోతీ ధరించి ఆవులకు సేవ చేస్తూ కనిపించాడు. కొన్నిసార్లు, జిమ్‌లో చెమటలు పట్టిస్తూ కనిపించాడు. మరుసటి క్షణం కృష్ణుడు అవతారంలో కనిపించాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియో తన సోషల్ మీడియా ఖాతా ట్వి్ట్టర్ ఎక్స్ ద్వారా షేర్ చేశారు. తాజాగా తేజ్ ప్రతాప్ శివభక్తికి సంబంధించినది. తేజ్ ప్రతాప్ యాదవ్ శివలింగానికి అంటిపెట్టుకుని క్షీరాభిషేకం చేశాడు. అతను శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటే, ఆలయ పూజారులు చెరకు రసంతో సహా పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తూ కనిపించారు. తేజ్ ప్రతాప్ పూర్తిగా భక్తిలో మునిగిపోయి శివలింగాన్ని అంటిపెట్టుకుని ఉంటే పూజారులు అభిషేకం చేశారు.

ఇందుకు సంబంధించి తేజ్ ప్రతాప్ యాదవ్ తన ఎక్స్ హ్యాండిల్‌లో వీడియోను పోస్ట్ చేశారు. దానితో పాటు మహాదేవుడు పరమ సత్యానికి ప్రతీక అని, మహాదేవ్‌ను ఆలింగనం చేసుకోవడం అంటే మనలోని అత్యంత లోతైన అంశాలను స్వీకరించడమే. దేశంలో నెలకొన్న పరిస్థితుల మధ్య శాంతి నెలకొల్పాలంటే మహాదేవుడు ఒక్కడితేనే సాధ్యం అని రాసుకొచ్చారు తేజ్ ప్రతాప్. దాన్ని సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలకు ట్యాగ్ చేశారు.

తేజ్ ప్రతాప్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ వీడియో గురించి ప్రముఖ సనాతన ధర్మ నిపుణుడు కె ప్రదీప్ జోషి స్పందించారు. తేజ్ ప్రతాప్ యాదవ్ శివలింగాన్ని కౌగిలించుకున్న విధానం సరియైనది కాదన్నారు. ఒక సాధువు అతనికి పాలు, పెరుగు, గంగాజలం సమర్పించి అభిషేకం చేయడం తప్పు అన్నారు. సనాతన ధర్మ సంప్రదాయానికి విరుద్ధమైన తేజ్ ప్రతాప్ యాదవ్‌పై తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీన్ని వెంటనే ఆపాలన్న ఆయన.. దీనిపై తేజ్ ప్రతాప్ యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..