AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2000 Rupees Notes: అక్కడ పెట్రోల్/డీజిల్ కొన్నా రూ.2 వేల నోట్లే ఇస్తున్నారు

రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరింస్తూ ఇటీవల ఆర్‌బీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పెట్రోల్‌ బంకుల వద్ద ఈ నోట్లతో చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. రూ.2వేల నోట్లతో ఇంధనం కొనుగోళ్లు దాదాపు 5 రెట్లు పెరిగినట్లు మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ జిల్లా పెట్రోల్‌ బంకుల సంఘం అధ్యక్షుడు రాజేంద్ర సింగ్‌ వాసు తెలిపారు.

2000 Rupees Notes: అక్కడ పెట్రోల్/డీజిల్ కొన్నా రూ.2 వేల నోట్లే ఇస్తున్నారు
Money
Aravind B
|

Updated on: May 23, 2023 | 4:07 AM

Share

రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరింస్తూ ఇటీవల ఆర్‌బీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పెట్రోల్‌ బంకుల వద్ద ఈ నోట్లతో చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. రూ.2వేల నోట్లతో ఇంధనం కొనుగోళ్లు దాదాపు 5 రెట్లు పెరిగినట్లు మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ జిల్లా పెట్రోల్‌ బంకుల సంఘం అధ్యక్షుడు రాజేంద్ర సింగ్‌ వాసు తెలిపారు. కొందరు కస్టమర్లు తమ వాహనాలకు రూ.100ల పెట్రోల్‌ లేదా డీజిల్‌ కొనుగోలు చేసినా రూ.2వేల నోటుతోనే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.

అయితే ఆర్‌బీఐ అనూహ్య నిర్ణయం వల్ల రూ.2వేల నోట్లతో ఇంధన కొనుగోలుకు చెల్లింపులు పెరిగినప్పటికీ.. ఈ నోట్లను బ్యాంకుల్లో సులభంగా మార్చుకునే అవకాశం ఉండటంతో తమకు ఇదేమీ పెద్ద ఇబ్బందిగా లేదని చెబుతున్నారు. ఇటీవల చాలా మంది కస్టమర్లు ఆన్‌లైన్‌ చెల్లింపులు చేస్తుండటంతో పెట్రోల్‌ బంకుల వద్ద తక్కువ డినామినేషన్‌ కరెన్సీ నోట్ల లభ్యత పెద్ద సమస్యగా లేదన్నారు. ఇదిలా ఉండగా దేశంలో 2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకొంటున్నట్టు శుక్రవారం ఆర్‌బీఐ అనూహ్య ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ నోట్లు కలిగి ఉన్నవారు సెప్టెంబర్‌ 30 వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసి నోట్లను మార్చుకొనేందుకు అవకాశం కల్పించింది. అలాగే రూ.50వేలు కన్నా ఎక్కువ మొత్తంలో రూ.2వేల నోట్లను డిపాజిట్‌ చేసేవాళ్లు పాన్‌ కార్డు సమర్పించాలని తాజగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు .

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..