AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajit Pawar: కర్ణాటకతో బార్డర్ వివాదం.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ లేఖ..

తమ రాష్ట్రానికి, కర్ణాటకకు మధ్య చాలాకాలంగా ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆయనకు లేఖ రాశారు.

Ajit Pawar: కర్ణాటకతో బార్డర్ వివాదం.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ లేఖ..
deputy cm ajit pawar
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Aug 11, 2021 | 5:21 PM

Share

తమ రాష్ట్రానికి, కర్ణాటకకు మధ్య చాలాకాలంగా ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆయనకు లేఖ రాశారు. బెల్గాం ఇతర బార్డర్ ప్రాంతాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఎంతో కాలంగా సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది. బెల్గామ్ తో బాటు కర్వార్, నిప్పానీ తదితర ప్రాంతాలు కర్ణాటక అధీనంలో ఉన్నప్పటికీ ఈ ప్రాంతాల్లో మరాఠీ భాష మాట్లాడే ప్రజలు (మరాఠాలు) ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ఇవి తమకే చెందాలని మహారాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ముంబై రాజధానిగా మహారాష్ట్ర ఏర్పడి 60 ఏళ్లకు పైగా అయిందని.. కానీ వీటితో బాటు బీదర్, భల్కి, వంటి ప్రాంతాలు ఇప్పటికీ కర్ణాటక అధీనంలో ఉన్నాయని, ఈ ప్రాంతాల మరాఠాలు తమను మహారాష్ట్రీయులుగా పరిగణించాలని కోరుతున్నారని అజిత్ పవార్ తమ లేఖలో తెలిపారు. పైగా మరాఠీ మాట్లాడే ప్రజలపై కర్ణాటక ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. దీన్ని ఆపాలంటే మీరు వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. వివాదాస్పద ఏరియాలను మా రాష్ట్రంలో చేర్చాలన్నారు.సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలను కలిపి సంయుక్త మహారాష్ట్ర ఏర్పడాలన్నదే తమ రాష్ట్ర కల అని, అది నెరవేరనంతవరకు శ్రమించదని ఆయన పేర్కొన్నారు.

కోర్టు ద్వారా తమ పోరాటం కొనసాగుతుందని.. మా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను వెంటనే పరిశీలించాలని ఆయన కోరారు. కాగా లోగడ కూడా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఓ సందర్బంలో కర్ణాటకలోని వివాదాస్పద ప్రాంతాల గురించి ప్రస్తావించారు. ఈ చోట్ల మరాఠాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం వీటిని తమకు చెందినవిగా చెప్పుకుంటోందన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు కోసం తాము వేచి చూస్తున్నామన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Corna Virus: స్కూళ్ళు తెరిచారు.. అప్పుడే 20 మంది పిల్లలకు సోకిన కరోనా వైరస్ పాజిటివ్.. ఎక్కడంటే ..?

India Gate: ‘ఇండియా గేట్’ ఎందుకు క‌ట్టారో తెలుసా..?.. దీని చరిత్ర ఏమిటి..?.. ఎన్నో ఆసక్తికర విషయాలు