Corna Virus: స్కూళ్ళు తెరిచారు.. అప్పుడే 20 మంది పిల్లలకు సోకిన కరోనా వైరస్ పాజిటివ్.. ఎక్కడంటే ..?
పంజాబ్ లోని లూధియానాలో స్కూళ్ళు తెరిచిన వారం రోజులకే 20 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ సోకింది. రెండు స్కూళ్లలోని విద్యార్థులు ఈ వైరస్ కి గురయ్యారని డిప్యూటీ కమిషనర్ వి.కె.శర్మ తెలిపారు
పంజాబ్ లోని లూధియానాలో స్కూళ్ళు తెరిచిన వారం రోజులకే 20 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ సోకింది. రెండు స్కూళ్లలోని విద్యార్థులు ఈ వైరస్ కి గురయ్యారని డిప్యూటీ కమిషనర్ వి.కె.శర్మ తెలిపారు. కోవిడ్ కేసులు తగ్గడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 2 నుంచి పాఠశాలలను తెరిచారు. అన్ని తరగతులవారికీ వీటిని మళ్ళీ ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. అయితే టీచర్లు, విద్యార్థులు అంతా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించామన్నారు. కానీ అటెండ్ కాలేని దూర ప్రాంత విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశించినట్టు విద్యా శాఖ మంత్రి విజయ్ ఇందర్ సింగ్ తెలిపారు. కరోనా పాండమిక్ సమయంలో విద్యార్థులు ఎంత మేరకు చదువు నేర్చుకున్నారో అంచనా వేయడానికి స్కూళ్ల పునఃప్రారంభం తోడ్పడుతుందని ఆయన చెప్పారు. మరో వైపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను తెరవాలని ఏ ప్రాతిపాదికన నిర్ణయం తీసుకున్నారని విపక్ష ఆప్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.డాక్టర్లు, విద్యావేత్తలు ఈ మేరకు నివేదిక ఏమైనా ఇచ్చారా అని ఈ పార్టీ నేత హర్ పాల్ సింగ్ ఛీమా అన్నారు. కోవిడ్ కేసులు తగ్గినప్పటికీ పిల్లలకు స్కూళ్ళు తెరవాలన్న నిర్ణయంపై తలిదండ్రులతో సంప్రదించారా అని కూడా ఆయన అన్నారు.
ఇది 60 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయమని,, వారే ఈ రాష్ట్ర ఫ్యూచర్ కి పునాది అని ఆయన పేర్కొన్నారు. కాగా 10 నుంచి 12 తరగతుల విద్యార్థులకు రాష్ట్రంలో గత నెల 26 నుంచే స్కూళ్ళు ప్రారంభించారు. అటు మహారాష్ట్ర లోని గ్రామీణ ప్రాంతాల్లో 5 నుంచి 12 తరగతులవారికి, పట్టణ ప్రాంతాల్లో 8 నుంచి 12 తరగతులవారికి ఈ నెల 17 నుంచి స్కూళ్లను మళ్ళీ తెరవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తమ పిల్లలను పాఠశాలలకు పంపాలా ..వద్దా అన్న నిర్ణయాన్ని విద్యార్థుల తలిదండ్రులకే వదిలివేసింది. పట్టణాల్లో కోవిడ్ కేసులు తగ్గినా అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కేసులు ఉన్నాయని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: India Gate: ‘ఇండియా గేట్’ ఎందుకు కట్టారో తెలుసా..?.. దీని చరిత్ర ఏమిటి..?.. ఎన్నో ఆసక్తికర విషయాలు