Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ఛార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా క్యాన్సిల్ టికెట్‌కి డబ్బు వాపస్.. రిఫండ్ కోసం ఇలా చేయండి..

రైల్వేలు ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది ఐఆర్టీసీ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌. ఎక్కువ దూరం, సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించాలంటే భారతీయ రైల్వేల ద్వారా మాత్రమే సాధ్యం.

Indian Railways: ఛార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా క్యాన్సిల్ టికెట్‌కి డబ్బు వాపస్.. రిఫండ్ కోసం ఇలా చేయండి..
Irctc
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 04, 2022 | 12:02 PM

ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది భారతీయ రైల్వే. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా చెప్పవచ్చు. ప్రయాణికులకు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వేశాఖ నిబంధనలను మారుస్తుంది. ఐఆర్‌సిటిసి ట్విటర్ ద్వారా ప్రయాణికుల సమస్యలను తెలుసుకుంటోంది.. వారు చెప్పే సమస్యలకు అనుగూణంగా వాటిలో మార్పులు చేస్తోంది. అనేక సార్లు ప్రయాణికులు రైలు టిక్కెట్‌ను బుక్ చేసిన తర్వాత రద్దు చేస్తుంటారు. ఇలా చేసినప్పుడు కొంత డబ్బు కట్ అవుతుంది. మిగిలిన మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది. అయితే.. ఛార్ట్ తయారు చేసిన తర్వాత.. చాలా సార్లు ప్రయాణీకులు అత్యవసర పరిస్థితుల్లో టిక్కెట్‌ను రద్దు చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో చార్ట్ సిద్ధం చేసిన తర్వాత టిక్కెట్‌ను రద్దు చేయవచ్చా లేదా అనే ప్రశ్న మీ మనస్సులో ఉండవచ్చు. ఐఆర్‌సీటీసీ ఈ మేరకు ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది.

అన్‌ట్రావెల్ చేయని టిక్కెట్‌ను రద్దు చేస్తే రీఫండ్ రీఫండ్ కోసం TDR నింపాలి. అయితే, దాని వాపసు కోసం మీరు ముందుగా TDRని పూరించాల్సి ఉంటోంది. దీని కోసం.. ముందుగా IRCTC వెబ్‌సైట్ కి వెళ్లండి. ఇక్కడ మీ ఖాతా ఎంపిక చేసుకోండి. ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ మెనులో My Transaction అనే ఎంపికను చేసుకోండి.

ఆ తర్వాత ఫైల్ TDR ఎంపికను ఎంచుకొని పూరించాలి. ప్రయాణీకుడికి సంబంధించిన సమాచారం మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీని తర్వాత PNR రైలు నంబర్ క్యాప్చా మొదలైనవాటిని నమోదు చేయడం ద్వారా రద్దు నియమాల బాక్స్‌పై క్లిక్ చేసి సమర్పించుపై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్‌కి OTP వస్తుంది. OTPని నమోదు చేయడం ద్వారా మీ PNR వివరాలను నిర్ధారించండి. ఈ ప్రక్రియ చేసిన తర్వాత.. క్యాన్సల్ చేసిన టిక్కెట్ ఎంపికను ఎంచుకోండి. ఇప్పుడు మీరు స్క్రీన్‌పై  వాపసు వచ్చిన డబ్బులను చూస్తుంది. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇచ్చిన నంబర్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అంతే.. ఇలా చేస్తే ఈజీగా మీ డబ్బులు మీ ఖాతాలో పడుతాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం