Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radha Ashtami: 5000 సంవత్సరాల సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. మధురలో రాధారాణి ఆలయంలో పూజలు.. భారీగా భక్తులు హాజరు

ఈరోజు రాధా అష్టమి సందర్భంగా, తనను సేవాదార్‌గా ఆమోదించాలని డిమాండ్ చేస్తూ రాష్ బిహారీ శనివారం అలహాబాద్ హైకోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు. ఈ అంశాన్ని అత్యవసరంగా పేర్కొంటూ, సెలవు రోజున విచారణ జరపాలని కోర్టుకు విజ్ఞప్తి కూడా చేశారు.

Radha Ashtami: 5000 సంవత్సరాల సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. మధురలో రాధారాణి ఆలయంలో పూజలు.. భారీగా భక్తులు హాజరు
Radha Asthami
Follow us
Surya Kala

|

Updated on: Sep 04, 2022 | 10:51 AM

Radha Ashtami: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మధురలోని రాధా రాణి ఆలయంలో 5000 సంవత్సరాల నాటి సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఈరోజు, రాధా అష్టమి సందర్భంగా గోస్వామి సమాజానికి చెందిన పురుష పూజారి అంటే సేవదర్ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆలయంలో పూజలు చేశారు. గుడిలో పూజ చేసుకునే హక్కు స్త్రీలు కూడా ఉందంటూ గత కొంతకాలంగా చర్చ జరిగినా అది జరగలేదు. మాయా దేవి కుటుంబం రాధా రాణి ఆలయంలో ప్రార్థనలు చేసింది. అయితే.. స్త్రీ పూజ విషయంపై అలహాబాద్ హైకోర్టు శనివారం ఈ కేసును విచారించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి నిరాకరించింది. రాధాష్టమి రోజున మధురలోని బర్సానేలో ఉన్న రాధా రాణి ఆలయంలో భారీ ఉత్సవం జరుగుతుంది. ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. రాధా రాణి ఆలయం 5000 సంవత్సరాల పురాతనమైనదిగా చెబుతారు. శ్రీ కృష్ణుని వారసులు ఈ రాధా రాణి ఆలయాన్ని నిర్మించారని భక్తుల నమ్మకం. హిందువులకు మథురలో బాంకే బిహారీ ఆలయం తర్వాత ఇది రెండవ అతి ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన దేవాలయంగా పరిగణించబడుతుంది.

ఆలయ సంప్రదాయం ప్రకారం.. గోస్వామి కమ్యూనిటీకి చెందిన పురుషులకు మాత్రమే ఆలయ సేవదార్ (పూజారి) అయ్యే అవకాశం ఉంది. ప్రార్థనలు చేసే హక్కు సేవాదార్‌కు మాత్రమే ఉంది. సంప్రదాయం ప్రకారం ఒకే కుటుంబానికి చెందిన వారికే ఆలయ సేవకునిగా అవకాశం లభిస్తోంది. కాలక్రమంలో మూడుగా విడిపోయిన ఆ కుటుంబంలోని పురుషులు ఒకొక్క సంవత్సరానికి ఒకొక్క కుటుంబానికి పూజారిగా స్వామివారి సేవను చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది పదవి కాలంలో ఆ కుటుంబంలోని పురుషులు స్వామివారిని సేవను చేసుకుంటారు. ఈ మేరకు గోస్వామి  కుటుంబ సభ్యులు తమలో తాము నియమాలను ఏర్పరచుకున్నారు.

1999లో నిబంధనల ప్రకారం  హర్బన్స్ లాల్ గోస్వామి ఈ ఏడాది ఏప్రిల్ 27 నుండి అక్టోబర్ 20 వరకు సేవాదార్‌గా పని చేయాల్సి ఉంది. అయితే హర్బన్స్ లాల్ మరణించారు. దీంతో అతని సోదరుడి మనవడు రాస్ బిహారీని ఆ సమయంలో సేవాదార్‌గా నియమించారు. రాస్‌బహరి నియామకానికి సంబంధించి కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు. రాష్ బిహారీ కూడా బాధ్యతలు స్వీకరించారు. అయితే మాయా దేవి అనే వితంతు మహిళ తాను హర్బన్స్ లాల్ గోస్వామి ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని అంటూ ఆలయ సేవకురాలిగా పదవి చేపడతానంటూ ముందుకొచ్చింది. దిగువ కోర్టు ఆదేశం ప్రకారం, మాయా దేవిని సేవకురాలిగా పరిగణించి పరిపాలన కూడా ఆ పదవిని చేపట్టింది. అయితే, తర్వాత ఈ కేసు జిల్లా కోర్టు నుండి హైకోర్టు వరకు వెళ్ళింది. అప్పుడు మాయాదేవి పదవిని రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి

మహిళ ఉద్దేశం తప్పు అని హైకోర్టు పేర్కొంది మాయాదేవిని సేవాదార్‌గా నియమించడాన్ని హైకోర్టు కూడా పరిగణనలోకి తీసుకోలేదని, తప్పుడు ఉద్దేశ్యంతో ఆ పదవిని ఆక్రమించిందని, కోర్టులో పిటిషన్  వేశారని వ్యాఖ్యానించింది. కుటుంబ సభ్యుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. మాయ సొసైటీకి చెందిన మగ లేదా గోస్వామి కాదని, కాబట్టి ఆమెకు సేవాదార్ పదవిలో అపాయింట్‌మెంట్ ఇవ్వలేమని పేర్కొంది. మాయా దేవిని హర్బన్స్ లాల్ భార్యగా తాము అంగీకరించమని కుటుంబ సభ్యులు చెప్పారు. మాయాదేవి చెప్పేవన్నీ అబద్దాలంటూ కుటుంబ సభ్యులు చెప్పారు. కోర్టు కూడా మాయా దేవిని హర్బన్స్ లాల్ గోస్వామి భార్యగా పరిగణించలేదు.

ఈరోజు రాధా అష్టమి సందర్భంగా, తనను సేవాదార్‌గా ఆమోదించాలని డిమాండ్ చేస్తూ రాష్ బిహారీ శనివారం అలహాబాద్ హైకోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు. ఈ అంశాన్ని అత్యవసరంగా పేర్కొంటూ, సెలవు రోజున విచారణ జరపాలని కోర్టుకు విజ్ఞప్తి కూడా చేశారు. దీనిపై శనివారం కూడా జస్టిస్ వివేక్ చౌదరితో కూడిన సింగిల్ బెంచ్ విచారణ చేపట్టింది. కోర్టు రాష్ బిహారీ పిటిషన్ ను విచారించిన కోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి కోర్టు నిరాకరించింది.

రాధా అష్టమి సందర్భంగా ఆలయంలో జాతర జరుగుతుందని విచారణ సందర్భంగా కోర్టు తెలిపింది. ఒకరోజు ముందే లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. అటువంటి పరిస్థితిలో, సేవను మార్చమని ఆదేశించడం వల్ల శాంతిభద్రతలు క్షీణించవచ్చు. తొక్కిసలాట లాంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అంటూ అభ్యతరం తెలిపింది. యాత్రికుల ప్రాణాలకు, ఆస్తులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సరికాదు. అదే సమయంలో.. మాయాదేవికి కోర్టు నోటీసు జారీ చేసింది.. మళ్ళీ కోర్టు కేసు విచారించే సమయంలోగా సమాధానం దాఖలు చేయాలని కోరింది.

సెప్టెంబర్ 12న మళ్లీ విచారణ సెప్టెంబరు 12న కోర్టు దీనిపై మరోసారి విచారణ చేపట్టనుంది. పిటిషనర్ తరపున ఆయన తరఫు న్యాయవాది అశుతోష్ శర్మ వాదిస్తూ, తాను సేవాదార్ అని చెప్పుకునే రాస్ బిహారీ గతంలో ఆగస్టు 27 నుంచి 29 వరకు ఆలయ ప్రాంగణంలో నిరాహార దీక్షన చేశారు. ఆరోగ్యం విషమించడంతో పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..