AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ పాదయాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్.. బీజేపీ రియాక్షన్ ఇదీ..

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాదం కదిపారు.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ పాదయాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్.. బీజేపీ రియాక్షన్ ఇదీ..
Rahul And Raghuram Rajan
Shiva Prajapati
|

Updated on: Dec 14, 2022 | 11:39 AM

Share

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాదం కదిపారు. ఇవాళ ఉదయం రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ నుండి కాంగ్రెస్ పాదయాత్ర పునఃప్రారంభమగా.. రాహుల్ గాంధీతో కలిసి రఘురామ్ రాజన్ నడిచారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో రఘురామ్ రాజన్ రాజన్ పలు అంశాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీతో కలిసి రఘురామ్ రాజన్ నడిచారంటూ క్యాప్షన్ పెట్టింది. ద్వేషానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయడానికి రాహుల్ గాంధీ చేపట్టిన ఈ భారత్ జడో యాత్రకు మద్ధతు పెరుగుతోందని పేర్కొంది కాంగ్రెస్.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ భారత్ జోడో యాత్రలో పాల్గొనడంపై బీజేపీ స్పందించింది. రాజన్ తనను తాను తదుపరి మన్మోహన్ సింగ్‌గా అభివర్ణించుకుంటున్నారని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థపై రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలను అవకాశవాద వ్యాఖ్యలుగా బీజేపీ విమర్శించింది.

కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర వచ్చే ఏడాది జనవరి గణతంత్ర దినోత్సవం రోజున కశ్మీర్‌లో ముగియనుంది. ఈ భారత్ జోడో యాత్రకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి విశేష స్పందన వచ్చింది. చాలా మంది రాహుల్ గాంధీ యాత్రలో కలిసి నడిచారు. ఉద్యమకారిణి మేధాపాట్కర్, నామ్ దేవ్ దాస్ త్యాగి, స్వర భాస్కర్, బాక్సర్ విజేందర్ సింగ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో రఘురామ్ రాజన్..

బీజేపీ రియాక్షన్ ఇదీ..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..