Rana Ayyub: మనీలాండరింగ్ కేసు.. జర్నలిస్ట్ రాణా ఆయుబ్‌కు బిగిస్తున్న ఉచ్చు..
Rana Ayyub Money Laundering Case: మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ జర్నలిస్టు రానా ఆయుబ్‌కు చెందిన రూ.1.77 కోట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. దాతల నిధులను వ్యక్తిగతంగా
Rana Ayyub Money Laundering Case: మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ జర్నలిస్టు రానా ఆయుబ్‌కు చెందిన రూ.1.77 కోట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. దాతల నిధులను వ్యక్తిగతంగా వినియోగించుకున్నారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ మేరకు ఈడీ రాణా ఆయుబ్ (Rana Ayyub) కు చెందిన రూ.1.77 కోట్లకు పైగా ఆస్థులను అటాచ్ చేసినట్లు గురువారం ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద రాణా అయూబ్, ఆమె కుటుంబం పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంక్ డిపాజిట్లను అటాచ్‌మెంట్ చేయడానికి ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయుబ్‌పై మనీలాండరింగ్ (Money Laundering Case) కేసు సెప్టెంబర్, 2021లో నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ చర్యలు తీసుకుంది. స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ఆమె ప్రజల నుంచి స్వీకరించిన నిధులలో అవకతవకలకు పాల్పడినట్లు రాణా ఆయుబ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆమె తీసుకున్న విరాళాలను సరైన ప్రయోజనాల కోసం ఉపయోగించలేదని.. విరాళాలలో కొంత భాగాన్ని వ్యక్తిగత ఖర్చుల కోసం వాడుకున్నారని ఈడీ అధికారి పేర్కొన్నారు.
కాగా.. ఆస్థుల అటాచ్‌పై రాణా ఆయుబ్ ఇంకా స్పందించలేదు. వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ రానా అయ్యూబ్ గత కొంతకాలంగా అధికార బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే.. హిందూ ఐటీ సెల్ NGO వ్యవస్థాపకుడు ఘజియాబాద్‌లోని ఇందిరాపురం నివాసి అయిన వికాస్ సాంకృత్యాయన్ ఫిర్యాదు మేరకు అయ్యూబ్‌పై కేసును నమోదైంది. జర్నలిస్ట్ రానా ఆయుబ్ 2020 – 2021 మధ్య స్వచ్ఛంద ప్రయోజనాల కోసం Ketto అనే ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ. 2.69 కోట్లకు పైగా సేకరించినట్లు ఈడీ పేర్కొంది. అయితే.. ఈ విరాళాలు, అభియోగాలపై ఆయుబ్ అప్పుడే స్పందించారు. విరాళాల వివరాలను పైసాతో సహా లెక్కచెబుతానని.. ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయలేదని పేర్కొన్నారు.
Also Read: