Sonia Gandhi: ప్రభుత్వ బంగ్లాలకు అద్దె చెల్లించని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ.. బీజేపీ ఆరోపణ

Sonia Gandhi: కాంగ్రెస్(Congress) తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సెంట్రల్ ఢిల్లీలోని జనపథ్ రోడ్లో (Janpath Road bungalow) ఉన్న బంగ్లాకు దాదాపు ఏడాదిన్నరగా అద్దె చెల్లించలేదని భారతీయ జనతా పార్టీ..

Sonia Gandhi: ప్రభుత్వ బంగ్లాలకు అద్దె చెల్లించని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ.. బీజేపీ ఆరోపణ
Sonia Gandhi
Follow us
Surya Kala

|

Updated on: Feb 10, 2022 | 6:38 PM

Sonia Gandhi: కాంగ్రెస్(Congress) తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సెంట్రల్ ఢిల్లీలోని జనపథ్ రోడ్లో (Janpath Road bungalow) ఉన్న ప్రభుత్వ బంగ్లాకు దాదాపు ఏడాదిన్నరగా అద్దె చెల్లించలేదని భారతీయ జనతా పార్టీ (BJP) పేర్కొంది. రాయ్‌బరేలీ ఎంపీ సోనియా గాంధీ గత ఏడాది ఐదునెలల నుంచి అద్దె చెల్లించలేదని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా ఆర్టీఐ కాపీని ట్వీట్టర్ లో షేర్ చేశారు. మాల్వియా షేర్ చేసిన ఆ నోటిపికేషన్ ప్రకారం, 2020 సెప్టెంబర్‌లో జన్‌పథ్‌లోని 10వ నంబర్ బంగ్లాకు సోనియా చివరిసారిగా అద్దె చెల్లించారు. అలాగే, అక్బర్ రోడ్ (Congress’ Seva Dal office) 26కి గత 9 సంవత్సరాలుగా కాంగ్రెస్ అద్దె చెల్లించలేదు. చివరిగా డిసెంబర్ 2012లో అద్దె చెల్లించినట్లు తెలుస్తోంది.

‘లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల ప్రయాణనికి సంబంధించిన విధానం’పై సోనియాపై విమర్శలు చేస్తూ.. మాల్వియా RTI నోటీస్ ను బహిర్గతం చేశారు. “వలస కార్మికుల టిక్కెట్ల కోసం సోనియా గాంధీ పెద్ద ఒప్పందం చేసుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు సోనియా ఏడాదిన్నరగా తన సొంత ఇంటి అద్దె చెల్లించలేదని తేలింది!” అంటూ ట్వీట్ చేశారు.

మహమ్మారి మొదటి వేవ్ సమయంలో ఈ ఓల్డ్ పార్టీ పాపం చేసి గందరగోళ వాతావరణాన్ని సృష్టించింది’ అని లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగడం గమనార్హం. “కరోనా వైరస్ మొదటి వేవ్ సమయంలో, కాంగ్రెస్ పరిమితిని దాటింది” అని ప్రధాని మోడీ ఆరోపించారు. లాక్డౌన్ ప్రకటన చేసిన సమయంలో కేంద్ర ప్రభుత్వం, WHO ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండండి అంటూ సలహా ఇస్తే.. ముంబై రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ వెళ్లి కరోనావైరస్ వ్యాప్తి చేయడానికి కార్మికులకు టిక్కెట్లు ఇచ్చారని ఆరోపించిన సంగతి తెలిసిందే.

Also Read:

Andhra Pradesh: అప్పటికల్లా కొత్త జిల్లాల ఏర్పాటు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?