Andhra Pradesh: అప్పటికల్లా కొత్త జిల్లాల ఏర్పాటు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచనల కామెంట్స్ చేశారు. జిల్లాల పునర్విభజన సమీక్షలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఉగాది నాటికే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. 

Andhra Pradesh: అప్పటికల్లా కొత్త జిల్లాల ఏర్పాటు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
Cm Jagan
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 10, 2022 | 6:57 PM

కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy ) కీలక ప్రకటన చేశారు. జిల్లాల పునర్విభజన సమీక్షలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఉగాది నాటికే కొత్త జిల్లాలను(New Distcs) ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఉగాది నుంచే కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని సీఎం జగన్‌ ప్రకటించారు. సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయన్నారు. ఉగాది నుంచే కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. దానికి సంబంధించిన సన్నాహాలు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. ప్రస్తుతమున్న కలెక్టర్లు, ఎస్పీలకు కొత్త జిల్లాల బాధ్యతలు అప్పగించాలన్నారు. వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ వచ్చిన రోజునుంచే ఓఎస్డీల హోదాలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు నిర్వహిస్తారన్నారు.

రాష్ట్రంలోఇప్పుడున్న జిల్లాలకు అదనంగా 13 జిల్లాలను కలుపుతూ 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ నియోజకవర్గానికొక జిల్లాను ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ వచ్చిన రోజునుంచే ఓఎస్డీల హోదాలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు కొనసాగుతారని వెల్లడించారు.

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత.. యంత్రాంగం అంతా సమర్థవంతంగా పనిచేయాలి :

కొత్త జిల్లాలో పని ప్రారంభమైన తర్వాత ఎలాంటి అయోమయం ఉండకూడదని సూచించారు. పాలన సాఫీగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. దీనికోసం సన్నాహకాలను చురుగ్గా, వేగంగా, సమర్థవంతంగా మొదలు పెట్టాలన్నారు. వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు జరగాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ఉద్యోగుల విభజన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, కొత్త భవనాలు వచ్చేలోగా యంత్రాంగం పనిచేయడానికి అవసరమైన భవనాల గుర్తించాలని అధికారులకు సూచించారు సీఎం జగన్.

అన్నిరకాలుగా సిద్ధం కావాలి :

కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యేలోగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కావాల్సిన భవనాలు తదితర వాటిని గుర్తించాలన్నారు. అలాగే కొత్త భవనాల నిర్మాణంపైనా ప్రణాళికలను ఖరారు చేయాలన్నారు. అందుకోసం స్థలాల గుర్తింపుపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు దానిపై నిశిత పరిశీలన చేయాలన్నారు.

నిర్ణయం తీసుకునేముందు వారితో మాట్లాడ్డం చాలా ముఖ్యం:

నిర్ణయం తీసుకునేముందు కొత్తగా వెళ్లేవారితో మాట్లాడాని.. వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని సీఎం ఆదేశించారు. వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందన్నారు. పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుందన్నారు.

వీరు కొత్త జిల్లాల్లో మౌలికసదుపాయాలు, పాలన సాఫీగా సాగేందుకు వీలుగా సన్నాహకాలను పరిశీలిస్తారన్న ముఖ్యమంత్రి జగన్. స్థానిక సంస్థల (జిల్లాపరిషత్‌ల విభజన) విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా వ్యవహరించాలని అన్నారు. చట్టపరంగా పరిశీలించి తగిన ప్రతిపాదనలు తయారుచేస్తామన్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి: Great Khali: ఎన్నికల వేల బీజేపీలో చేరిన మహా బలుడు.. ప్రధాని మోడీపై ది గ్రేట్ ఖలీ ప్రశంసలు…

UP Assembly Election 2022 Phase 1 Polling Live Updates: మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 35.03 శాతం ఓటింగ్‌

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!