రాజ్యసభలో విపక్షాల రభసల పర్వం.. సభా కార్యకలాపాల సమయం 28 గంటలే !
లోక్ సభ మాదిరే రాజ్యసభ కూడా బుధవారం నిరవధికంగా వాయిదా పడింది. జులై 19 న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచే ప్రతిపక్షాలు పెగాసస్ వివాదం సహా వివాదాస్పద రైతు చట్టాలు తదితర సమస్యలపై సభలో రభస సృష్టిస్తూ వచ్చాయి.
లోక్ సభ మాదిరే రాజ్యసభ కూడా బుధవారం నిరవధికంగా వాయిదా పడింది. జులై 19 న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచే ప్రతిపక్షాలు పెగాసస్ వివాదం సహా వివాదాస్పద రైతు చట్టాలు తదితర సమస్యలపై సభలో రభస సృష్టిస్తూ వచ్చాయి. ప్రశ్నోత్తరాల సమయం చాలావరకు వాయిదా పడుతూ వచ్చింది.మొత్తం 19 బిల్లులను సభ ఆమోదించింది. 28 శాతం ప్రొడక్టివిటీ నమోదైనట్టు పీఆర్ఎస్ నివేదిక తెలిపింది. మొత్తం గంటల్లో 4.3 గంటలు ప్రశ్నలపైన, 6.9 గంటలు లెజిస్లేషన్ పైన, 5.2 గంటలు నాన్-లెజిస్లేటివ్ కార్యకలాపాలపైనా వ్యయమయ్యాయి. 102 గంటలు సిటింగ్ టైం కాగా..ఇందులో 28 గంటల 21 నిముషాల సమయాన్ని ఫంక్షనల్ టైం (పని చేసిన కాలం) గా రాజ్యసభ సెక్రటేరియట్ వెల్లడించింది. సభా ప్రొసీడింగ్ కమిటీకి సంబంధించిన డిపార్ట్ మెంట్ 17 సార్లు సమావేశం కాగా ఇవి ఒక్కొక్కటి సగటున 54.45 శాతం మీట్ అయ్యాయని, ఇది హయ్యెస్ట్ అని ఈ విభాగం పేర్కొంది. సభా కార్యకలాపాలకు అంతరాయం కారణంగా కనీసం 406 జీరో అవర్లు, స్పెషల్ మెన్షన్లను సభ కోల్పోయింది.
సభలో గందరగోళాల కారణంగా మొత్తం మూడు సార్లు నిన్న వాయిదా పడుతూ వచ్చింది. సాయంత్రం 7.04 వరకు ప్రొసీడింగ్స్ 30 నిముషాల చొప్పున వాయిదా పడ్డాయి. 7 గంటల 4 నిముషాల అనంతరం సభ.. రాష్ట్రాల అదీనంలోని జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీల ప్రైవేటీకరణ బిల్లును ఆమోదించింది. మొత్తం 19 బిల్లులు ఆమోదానికి నోచుకోగా గత ఏడాది 27 బిల్లులు పాసయ్యాయి. అప్పుడు ప్రొసీడింగ్స్ 99 శాతం ఉన్నట్టు రాజ్యసభ సెక్రటేరియట్ పేర్కొంది. ముఖ్యమైన బిల్లుల్లో నిత్యావసరాల (సవరణ) బిల్లు, రైతుల చట్టాల సవరణ బిల్లు, సోషల్ సెక్యూరిటీ కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ బిల్లులు ఆమోదం పొందాయి. గత ఏడాది సెప్టెంబరు 23 న పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడిన విషయం గమనార్హం.
మరిన్ని ఇక్కడ చూడండి : హరీష్ రావు ఎంట్రీతో మరింత వేడెక్కిన హుజూరాబాద్ రాజకీయం..హోరెతించిన గులాబీ.:Huzurabad Politics Live Video.
బుర్జ్ ఖలీఫా హోటల్ పై మహిళ…ఇదెక్కడి యాడ్ రా మావా..!వీడియో వైరల్..:woman on Burj Khalifa Video.