Rajinikanth: విజయ్ కాదు.. ఆయన సీఎం అయితే అసూయపడేవాడిని.. రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు!
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తమిళసూపర్ స్టార్ రజీనీకాంత్ కీలక వాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో లేనని, తాను ఎందుకు విజయ్‌ను చూసి అసూయ పడతానన్నారు. ఒకవేళ కమల్ ముఖ్యమంత్రి అయి ఉంటే బహుశా తాను అసూయ పడి ఉండేవాడినేమో? అన్నారు. తనకు విజయ్ సమవుజ్జీ కాదన్నారు.కేవం స్టాలిన్‌ను పరామర్శించేందుకు మాత్రమే కలిశానని.. అందులో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు.

సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివ్ ప్రచారంపై తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ సీరియస్ అయ్యారు. ఈ ఉదయం చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన రజనీకాంత్, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తనపై కొన్ని వదంతులు వ్యాపిస్తున్నాయని అన్నారు. దీనిపై నేను వివరణ ఇవ్వకపోతే అది సరికాదని, అందుకే ఈ విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నానని ఆయన చెప్పారు. తాను స్టాలిన్‌ను కలుసుకోవడంలో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు.. స్టాలిన్ తనకు మంచి స్నేహితుడని.. ఎన్నికల్లో ఓటమి తర్వాత స్టాలిన్‌ను పరామర్శించేందుకే మాత్రమే ఆయన్ను కలిశానన్నారు.
విజయ్‌ని సీఎం కాకుండా అడ్డుకోవాలని తాను చూడలేదని రజినీకాంత్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి నీచ రాజకీయాలు తాను చేయనన్నారు. విజయ్ తనకు సమవుజ్జీ అనుకోవడం లేదని తెలిపారు. విజయ్‌కు, తనకు 25 ఏళ్ల వ్యత్యాసం ఉందన్నారు. ఒక వేళ కమల్‌హాసన్ సీఎం అయితే అసూయపడే వాడినని చెపుకొచ్చాడు. తను అన్నిపార్టీల్లోనూ అభిమానులు ఉంటారని తెలిపారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే విజయ్‌ని గెలిపించారనీ రజినీకాంత్ వివరించారు.
I agree most of the points of Rajinikanth Sir. Definitely Anils should stop personal attacking on him at least for Vijay anna.
But Rajinikanth having jealous on vijay for sure 💯😂#Rajinikanth #Vijay pic.twitter.com/dybSphs8dW
— Kishore Chandapura (@kishorecpr) May 17, 2026
ఈ క్రమలోంనే పార్టీపైనా, రాజకీయాలపైనా రజినీకాంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు 2021లో పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినని తెలిపారు. దీంతో ఇప్పుడు రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
