AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shortest Cricketers : ఆటకు ఎత్తు అడ్డుకాదు.. క్రికెట్ హిస్టరీలో అత్యంత తక్కువ ఎత్తు ఉన్న టాప్-5 ప్లేయర్లు వీళ్లే

Shortest Cricketers : ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవాలన్నా, భారీ సిక్సర్లు బాదాలన్నా పొడవుగా ఉండటం ప్లస్ పాయింట్ అని చాలామంది నమ్ముతారు. కానీ క్రికెట్ చరిత్రలో కొందరు ఆటగాళ్లు తమ తక్కువ ఎత్తుతోనే ప్రపంచాన్ని శాసించారు. ఎత్తు అనేది టాలెంటుకు అడ్డు కాదని వీరు నిరూపించారు.

Shortest Cricketers : ఆటకు ఎత్తు అడ్డుకాదు.. క్రికెట్ హిస్టరీలో అత్యంత తక్కువ ఎత్తు ఉన్న టాప్-5 ప్లేయర్లు వీళ్లే
Shortest Players
Rakesh
|

Updated on: May 17, 2026 | 10:49 AM

Share

Shortest Cricketers : క్రికెట్ అనగానే మనకు ఆరు అడుగుల పొడవు, స్ట్రాంగ్ బాడీ ఉన్న ఆటగాళ్లే గుర్తుకువస్తారు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవాలన్నా, భారీ సిక్సర్లు బాదాలన్నా పొడవుగా ఉండటం ప్లస్ పాయింట్ అని చాలామంది నమ్ముతారు. కానీ క్రికెట్ చరిత్రలో కొందరు ఆటగాళ్లు తమ తక్కువ ఎత్తుతోనే ప్రపంచాన్ని శాసించారు. ఎత్తు అనేది కేవలం శరీరానికి సంబంధించిందే తప్ప, టాలెంటుకు అడ్డు కాదని వీరు నిరూపించారు. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాల నుంచి నేటి ముష్ఫికర్ రహీమ్ వరకు.. పొట్టిగా ఉన్నా మైదానంలో పరుగుల సునామీ సృష్టించిన ఆ ఐదుగురు వీరులెవరో వివరంగా చూద్దాం.

1. క్రూగర్ వాన్ విక్ (న్యూజిలాండ్) – 150 సెంటీమీటర్లు

క్రికెట్ చరిత్రలో అత్యంత పొట్టి ఆటగాడిగా న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ క్రూగర్ వాన్ విక్ రికార్డుల్లో నిలిచారు. ఆయన ఎత్తు కేవలం 4 అడుగుల 9 అంగుళాలు (150 సెం.మీ.). అంత తక్కువ ఎత్తు ఉన్నప్పటికీ, మైదానంలో ఆయన చూపించే చురుకుదనం అద్భుతం. వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదిలే ఆయన కీపింగ్ నైపుణ్యం చూసి దిగ్గజాలే ఆశ్చర్యపోయేవారు.

2. టిచ్ కార్న్‌ఫోర్డ్ (ఇంగ్లాండ్) – 152 సెంటీమీటర్లు

ఇంగ్లాండ్‌కు చెందిన మాజీ వికెట్ కీపర్ టీచ్ కార్న్‌ఫోర్డ్ ఎత్తు కేవలం 5 అడుగులు. 1930వ దశకంలో ఇంగ్లాండ్ తరపున ఆడిన ఆయన, తన అద్భుతమైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించారు. అప్పట్లో నేటి కాలంలాంటి ఫిట్‌నెస్ సౌకర్యాలు లేకపోయినా, తన సాంకేతిక నైపుణ్యంతో మేటి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

3. సునీల్ గవాస్కర్ (భారత్) – 157 సెంటీమీటర్లు

భారత క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఎత్తు కేవలం 5 అడుగుల 2 అంగుళాలు. కానీ, మైదానంలో ఆయన ఆత్మవిశ్వాసం ముందు ఆకాశమంత ఎత్తు ఉన్న బౌలర్లు కూడా వణికిపోయేవారు. హెల్మెట్ కూడా సరిగ్గా లేని ఆ రోజుల్లో ప్రపంచంలోని అత్యంత భయంకరమైన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లను గవాస్కర్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. క్రికెట్ చరిత్రలో 10 వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా ఆయన సృష్టించిన రికార్డు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.

4. టిచ్ ఫ్రీమాన్ (ఇంగ్లాండ్) – 157 సెంటీమీటర్లు

ఇంగ్లాండ్‌కు చెందిన లెగ్ స్పిన్నర్ టిచ్ ఫ్రీమాన్ కూడా 5 అడుగుల 2 అంగుళాల ఎత్తుతోనే క్రికెట్ ప్రపంచాన్ని వణికించారు. ఆయన ఎత్తు తక్కువైనా, బంతిని తిప్పడంలో ఆయనకు ఆయనే సాటి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆయన వేల సంఖ్యలో వికెట్లు పడగొట్టి, ఎత్తుకు ప్రతిభకు సంబంధం లేదని చాటి చెప్పారు.

5. ముష్ఫికర్ రహీమ్ (బంగ్లాదేశ్) – 160 సెంటీమీటర్లు

బంగ్లాదేశ్ సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో అత్యంత పొట్టి ఆటగాళ్లలో ఈయన ఒకరు. చిన్న కాయమే అయినా, క్రీజులో నిలబడితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తారు. బంగ్లాదేశ్ క్రికెట్ ఎదుగుదలలో ఈయన పాత్ర ఎంతో కీలకం. తన పోరాట పటిమతో ఎన్నో మ్యాచులను గెలిపించి జట్టుకు వెన్నెముకగా నిలిచారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us