మరో చెన్నై కాబోతున్న జైపూర్ ..పింక్ సిటీకి వాటర్ కష్టాలు

నీటిని బ్యాంకులో డబ్బు మాదిరిగా జాగ్రత్తగా కాపాడుకునే పరిస్థితులొచ్చాయి.ఒక వైపు భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతుంటే మరోవైపు పలు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడనుందనే వార్త ఆందోళనకు గురిచేస్తుంది. చెన్నైలో గతంలో ఎన్నడూ లేనంతగా నీటి కరవుతో జనం అల్లాడిపోయారు. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో నీటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని వరణదేవుని కరుణకోసం పూజలు చేస్తున్నారు. కొందరు సంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రకారం కప్పలకు పెళ్లిళ్లు చేస్తూ .. ఎవరికి […]

మరో చెన్నై కాబోతున్న జైపూర్ ..పింక్ సిటీకి వాటర్ కష్టాలు
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 1:56 PM

నీటిని బ్యాంకులో డబ్బు మాదిరిగా జాగ్రత్తగా కాపాడుకునే పరిస్థితులొచ్చాయి.ఒక వైపు భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతుంటే మరోవైపు పలు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడనుందనే వార్త ఆందోళనకు గురిచేస్తుంది. చెన్నైలో గతంలో ఎన్నడూ లేనంతగా నీటి కరవుతో జనం అల్లాడిపోయారు. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో నీటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని వరణదేవుని కరుణకోసం పూజలు చేస్తున్నారు. కొందరు సంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రకారం కప్పలకు పెళ్లిళ్లు చేస్తూ .. ఎవరికి తోచిన విధంగా వారు ఆకాశం వైపు చూడాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురవకపోతే మరో రాష్ట్రం కూడా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల చెన్నైలో ఎదుర్కొన్న దారుణ పరిస్థితులకంటే ఎక్కువగా రాజస్ధాన్‌ రాజధాని జైపూర్‌లో మరీ ఎక్కువగా ఈ సమస్య ఉండబోతుందని చెబుతున్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఈ సమస్య మరింత జఠిలమయ్యే పరిస్థితులు ఉన్నాయంటున్నారు. రాజస్థాన్‌లో గత దశాబ్ధకాలంలో భూగర్భ జలాలు 62 శాతం మేర తగ్గిపోయాయి.

రాజస్ధాన్ ముఖ్యపట్టణం జైపూర్‌‌లో గత ఏడాది ఇదే సమయానికి 225 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఈ ఏడాది 116 మిల్లీ మీటర్లు కురిసింది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో నీటి సమస్యతో అల్లాడిపోవడం తప్పదని హెచ్చరిస్తున్నారు జైపూర్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ అధికారులు. రాజస్దాన్‌లో గల 12 జిల్లాల్లో గత ఏడాది తో పోల్చితే ఇప్పటివరకు 60 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు. దాదాపు 30 లక్షల జనాభా కలిగిన జైపూర్ నగరానికి మంచినీటిని అందించే బిలాస్‌పూర్ డ్యామ్‌లో మరో నెల రోజులకు సరిపడా నీరు మాత్రమే ఉంది. దీంతో రానున్న నీటికరువును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు నీటిని ఒడిసి పట్టాలని సూచిస్తున్నారు . కురుస్తున్న ప్రతి వాన చినుకును ఇంకుడు గుంతలకు మళ్లిస్తే భూగర్భ జలాలు పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. వర్షపు నీటిని వృధా చేయకుండా ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించి వాటిని ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు