AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Scandal Video: మంత్రిగారి గలీజ్ పనులు.. లీకైన వీడియో.. బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్..

ఈ మధ్య కాలంలో ప్రజాప్రతినిధులు.. పరిపాలనా వ్యవహారాలను పక్కన పెట్టి గలీజ్ వ్యవహారలపై ఫోకస్ పెట్టినట్లున్నారు. ఇప్పటికే ఎంతోమంది నేతల రాసలీలలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వగా..

Minister Scandal Video: మంత్రిగారి గలీజ్ పనులు.. లీకైన వీడియో.. బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్..
Rajasthan Minister Scandal
Shiva Prajapati
|

Updated on: Dec 08, 2022 | 11:40 AM

Share

ఈ మధ్య కాలంలో ప్రజాప్రతినిధులు.. పరిపాలనా వ్యవహారాలను పక్కన పెట్టి గలీజ్ వ్యవహారలపై ఫోకస్ పెట్టినట్లున్నారు. ఇప్పటికే ఎంతోమంది నేతల రాసలీలలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వగా.. తాజాగా మరో రాష్ట్ర మంత్రికి చెందిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్ మంత్రి సలేహ్ మహ్మద్‌కు చెందిన రాసలీలల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మంత్రి మహ్మద్, ఓ మహిళ అభ్యంతకరంగా ఉన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బీజేపీ.. మంత్రిని బర్తరఫ్ చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. అయితే, బీజేపీ చేస్తున్న ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు మంత్రి మహ్మద్. బీజేపీ ఆరోపణలు నిరాధారమైనవని, అదంతా ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు.

పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు..

కాగా, ఈ వీడియో వ్యవహారంపై డిసెంబర్ 5వ తేదీన బాధిత మహిళ జోధ్‌పూర్‌లోని షేర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన వీడియోను పొరపాటున తీశారని, తన 7 ఏళ్ల కూతురు ఫోన్‌లో గేమ్ ఆడుతూ పొరపాటున మరొకరికి ఆ వీడియోను ఫార్వార్డ్ చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. ఆ విషయం తనకు తెలియదని స్పష్టం చేసింది. రెండు నెలల క్రితం తన బంధువుల వద్దకు వెళ్లగా.. వీడియోను వైరల్ చేస్తానని నిందితులు బెదిరించారని మహిళ ఆరోపించింది. రూ. 25 లక్షల రూపాయలు డిమాండ్ చేయడమే కాకుండా, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. దీంతో మనస్తాపానికి గురైన తాను ఆత్మహత్య కూడా చేసుకోవాలని ప్రయత్నించినట్లు మహిళ ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోకరన్‌కు చెందిన పంకజ్‌ విష్ణోయ్‌, వికాస్‌, రాంజాస్‌ విష్ణోయ్‌, సుమిత్‌ విష్ణోయ్‌, రవీంద్ర విష్ణోయ్‌ లను అరెస్ట్ చేశారు.

మంత్రిని ఇరికించే ప్రయత్నం..

ఈ ఏడాది జనవరి నెలలో మంత్రి రాంలాల్ జాట్‌ను సెక్స్ స్కాండల్‌లో ఇరికించే ప్రయత్నం జరిగింది. ఈ విషయాన్ని జోధ్‌పూర్ పోలీసులు వెల్లడించారు. ఓ మోడల్ ద్వారా రాజస్థాన్ రెవెన్యూ మంత్రి రాంలాల్ జాట్‌ను హనీట్రాప్ చేయడానికి కుట్ర పన్నారు. అయితే, ఆ కుట్ర విఫలమైంది. ఈ కేసులో మోడల్ దీపిక(30), అక్షత్(32)ని భిల్వారా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుట్రను స్వయంగా మంత్రి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..