Sachin – Sara: కాలేజీలో ప్రేమ, ఆపై తండ్రిపై తిరుగుబాటు.. సచిన్ – సారా ప్రేమ కథకు బ్రేక్!

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ భార్య సారా నుంచి విడిపోయారు. సచిన్ పైలట్ ఎన్నికల అఫిడవిట్‌లో వీరిద్దరి మధ్య విడాకుల విషయం వెల్లడైంది.

Sachin - Sara: కాలేజీలో ప్రేమ, ఆపై తండ్రిపై తిరుగుబాటు.. సచిన్ - సారా ప్రేమ కథకు బ్రేక్!
Sachin Pilot, Sara Abdullah
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 31, 2023 | 9:34 PM

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ భార్య సారా నుంచి విడిపోయారు. సచిన్ పైలట్ ఎన్నికల అఫిడవిట్‌లో వీరిద్దరి మధ్య విడాకుల విషయం వెల్లడైంది. మతాలు వేరైనా పెద్దలను కాదని సారా, సచిన్ పైలట్ జనవరి 2004లో వివాహం చేసుకున్నారు.

నవంబర్ 25న రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా అక్టోబర్ 31న సచిన్ పైలట్ టోంక్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌లో ఇచ్చిన అఫిడవిట్‌లో, ‘స్పౌజ్‌’ అనే ఆప్షన్‌ వద్ద డివోర్స్‌ అని పేర్కొనడంతో అంతా షాక్‌ అవుతున్నారు. 2004లో సారా అబ్దుల్లాను వివాహం చేసుకున్నారు సచిన్‌ పైలట్‌. జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా కుమార్తెనే సారా. అప్పట్లో వీరి వివాహం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. సారా కుటుంబం అంటే అబ్దుల్లా కుటుంబం ఈ వివాహాన్ని బహిష్కరించింది. వీరికి ప్రస్తుతం ఇద్దరు కుమారులు అరాన్‌, విహాన్‌ ఉన్నారు. అయితే ఇద్దరు కుమారులు ప్రస్తుతానికి తనపై ఆధారపడి ఉన్నారని పైలట్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Sachin Pilot Affidavit

Sachin Pilot Affidavit

సచిన్ – సారా ఇద్దరి కుటుంబాలు రాజకీయాల్లో చురుకుగా ఉన్నాయి. సచిన్ పైలట్ దివంగత కాంగ్రెస్ నేత రాజేష్ పైలట్ కుమారుడు. అదే సమయంలో, సారా జమ్మూ, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కుమార్తె. నేషనల్‌ కాన్ఫరెన్సు నేత ఒమర్ అబ్దుల్లాకు స్వయాన సోదరి.

9 ఏళ్ల కిందటే సచిన్‌ పైలట్ నుంచి సారా విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అలాంటి వార్తలు రావడంతో దంపతులిద్దరూ ఖండించారు. ఆ తరువాత 2018 డిసెంబరులో రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా సచిన్‌ పైలట్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తండ్రి ఫరూక్‌ అబ్దులా, ఇద్దరు కుమారులు అరాన్‌, విహాన్‌లతో కలిసి సారా హాజరయ్యారు. తాజాగా ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌ వెలుగులోకి రావడంతో, మరోసారి సచిన్‌, సారా దంపతుల విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. సచిన్‌ పైలట్‌ ఆస్తుల విషయానికి వస్తే ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. గత ఐదేళ్లలో రెట్టింపు అయ్యాయి. 2018 సచిన్ పైలట్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 3.8 కోట్లు కాగా, తాజా ఆయన ఆస్తులను రూ.7.5 కోట్లుగా పేర్కొన్నారు.

సచిన్ పైలట్ ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో జన్మించారు. సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి పాఠశాల విద్య, గ్రాడ్యుయేషన్ తర్వాత, అతను పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి MBA అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళారు. సారా 1990 వరకు కాశ్మీర్‌లో తన కుటుంబంతో నివసించింది. ఆ తర్వాత, కాశ్మీర్ లోయలో కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా, ఫరూక్ అబ్దుల్లా సారాను ఆమె తల్లితో కలిసి లండన్‌కు పంపారు. సారా, సచిన్‌లు లండన్‌లో తొలిసారి కలుసుకున్నారు. సచిన్, సారా తండ్రి ఇద్దరూ స్నేహితులు. ఒకరి కుటుంబంతో ఒకరు సుపరిచితులు. ఇదే వీరిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది.

గుర్జార్ కుటుంబం నుండి వచ్చిన సచిన్, సనాతన ముస్లిం కుటుంబం నుండి వచ్చిన సారా పెళ్లికి ఇరువురి కుటుంబాల అంగీకారం లభించలేదు. నెలల తరబడి వేచి చూసినా పరిస్థితి మారకపోవడంతో 2004 జనవరిలో సారా, సచిన్ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి చాలా తక్కువ మందికి మాత్రమే ఆహ్వానం అందింది. అబ్దుల్లా కుటుంబం ఈ వివాహాన్ని బహిష్కరించింది. కాలం గడిచేకొద్దీ ఫరూక్ అబ్దుల్లా గత చేదు జ్ఞాపకాలను మరిచి తండ్రీకూతుళ్లు మళ్లీ ఒక్కటయ్యారు. పెళ్లయిన కొన్ని నెలలకే సచిన్ పైలట్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…