Maratha Reservation: మహారాష్ట్రలో రిజర్వేషన్ చిచ్చు.. కీలక ప్రకటన చేసిన షిండే ప్రభుత్వం..
Maratha Reservation: రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ మరాఠాలు చేస్తున్న ఉద్యమం మహారాష్ట్రలో ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. బీడ్‌లో సోమవారం NCP ఎమ్మెల్యే ఇంటిని కొందరు ఉద్యమకారులు నిప్పంటించారు. దీంతో బీడ్ జిల్లాలో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అక్కడ కర్ప్యూ విధించారు. నిన్నటి ఘటనకు సంబంధించి 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కోటా ఉద్యమం ధారాశివ్ జిల్లాకు వ్యాపించింది. అక్కడ కూడా కర్ఫ్యూ విధించారు.
Maratha Reservation: రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ మరాఠాలు చేస్తున్న ఉద్యమం మహారాష్ట్రలో ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. బీడ్‌లో సోమవారం NCP ఎమ్మెల్యే ఇంటిని కొందరు ఉద్యమకారులు నిప్పంటించారు. దీంతో బీడ్ జిల్లాలో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అక్కడ కర్ప్యూ విధించారు. నిన్నటి ఘటనకు సంబంధించి 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కోటా ఉద్యమం ధారాశివ్ జిల్లాకు వ్యాపించింది. అక్కడ కూడా కర్ఫ్యూ విధించారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో హింస చెలరేగుతోంది.
రిజర్వేషన్లు కోరుతూ మహారాష్ట్రలో మరాఠాలు చేస్తున్న ఆందోళనకు అక్కడి ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా షిండే నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. OBC రిజర్వేషన్లు పొందేందుకు అవసరమైన కున్బీ కుల సర్టిఫికేట్లు జారీకి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ విషయంలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ షిండే కమిటీ అందించిన తొలి నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
మనోజ్ జారంగేతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం ఏక్‌నాథ్ షిండే..
మరోవైపు మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. ఆమరణ నిరాహర దీక్ష చేస్తున్న మనోజ్ జారంగేతో సీఎం ఏక్‌నాథ్ షిండే ఫోన్‌లో చర్చలు జరిపారు. రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. దీక్ష విరమించాలని సీఎం విజ్ఞప్తి చేయడంతో జారంగే వెనక్కి తగ్గారు. దాదాపు అరగంట సేపు ఫోన్‌లో సీఎం మాట్లాడారు. దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఏడు రోజుల క్రితం జారంగే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటం, రాష్ట్రంలో హింస చెలరేగడంతో సీఎం షిండే జారంగేతో చర్చలు జరిపారు.
గవర్నర్‌ను కలిసి పరిస్థితిని వివరించిన మహా సీఎం షిండే..
సామాజికంగా, విద్యాపరంగా మరాఠా సామాజికవర్గపు వెనుకబాటుతనాన్ని మదింపు చేసేందుకు OBC కమిషన్ కొత్తగా సమాచారం సేకరిస్తుందని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. అలాగే చట్టపరంగా మరాఠా రిజర్వేషన్ అమలు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి న్యాయ సలహా ఇచ్చేందుకు ముగ్గురు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో ఒక త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. అదే సమయంలో గవర్నర్ రమేష్ బైస్‌ను కలిసిన సీఎం రాష్ట్రంలోని పరిస్థితి, తీసుకుంటున్న చర్యలను వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..