Viral: ట్రైన్‌లోని ఓ భోగి టాయిలెట్ వద్ద అనుమానాస్పదంగా 3 బ్యాగులు.. పోలీసులు వాటిని ఓపెన్ చేయగా
అక్రమార్కులు... అస్సలు తగ్గడం లేదు. పుష్పను మించిన స్కెచ్చులతో రెచ్చిపోతున్నారు. పోలీసులకు చిక్కకుండా తమ మార్క్ క్రియేటివిటీని వాడుతున్నారు.
గంజాయి.. ఇప్పుడు ఎక్కడ బడితే అక్కడ ఈ మత్తు పదార్థం పట్టుబడుతూనే ఉంది. రోజుకో కొత్త మార్గంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు స్మగ్లర్స్. ఈ దగుల్బాజీ పని కోసం అనువైన అన్ని మార్గాలను వినియోగించుకుంటున్నారు. పోలీసుల వేట అధికంగా ఉండటంతో స్మగ్లర్స్ మత్తును రవాణా చేసేందుకు కొత్త.. కొత్త రూట్స్ అన్వేశిస్తున్నారు. తమ క్రియేటివిటీతో పోలీసులనే విస్మయానికి గురి చేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా భారీగా గంజాయిని తరలించే ఏకైక లక్ష్యంతో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ముందుకు సాగుతున్నారు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి మార్గాలు అన్నట్టు.. ఈ కేటుగాళ్లు ఎత్తులు ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా పోలీసులు, స్పెషల్ టీమ్స్ భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో రైళ్లలో కూడా మాయదారి మత్తు రవాణా సాగుతుంది. అందుకే RPF టీమ్స్ డాగ్ స్క్వాడ్ సాయంతో చెకింగ్స్ చేస్తున్నాయి. తాజాగా బుధవారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది.. లుండింగ్-గౌహతి ఎక్స్‌ప్రెస్‌లోని ఓ కంపార్ట్‌మెంట్‌లోని టాయిలెట్ దగ్గర ఉంచిన మూడు అనుమానస్పద బ్యాగులు గుర్తించారు. వాటిని ఓపెన్ చేయగా లోపల గంజాయి కనిపించింది. ప్యాక్ చేసిన 25.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నిషిద్ధ వస్తువులను గౌహతిలోని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) OCకి అప్పగించినట్లు RPF సిబ్బంది తెలిపారు. (Source)
జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..