దేశంలో వివిధ ప్రాంతాలను కలిపేలా భారత రైల్వే శాఖ కొత్త రూట్లలో కొన్ని రైళ్లను ప్రారంభించింది. ఈశాన్య రాష్ట్రాలను చూసేందుకు ఇటీవలే భారత్ గౌరవ్ డెలుక్స్ అనే టూరిస్టు ట్రైన్ ను ప్రవేశపెట్టింది. ఈ రైలు లోపల ఎలా ఉంటుందో అని ప్రయాణికులు తెలిసేవిధంగా రైల్వే శాఖ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ప్రయాణికులకు కావల్సిన చిన్న లైబ్రరీ, డైనింగ్ రెస్టారెంట్ లు కూడా ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థమే ఈ వసతులన్ని ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా ఈ ట్రైన్ 15 రోజుల పాటు టూర్ వేయనుంది. మార్చి 21న ఈ టూర్ ఢిల్లీలోని సఫ్ దర్జంగా రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో అస్సాం, త్రిపురా, నాగలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలను చూపించనున్నారు. దాదాపు 156 టూరిస్టులు ప్రస్తుతం ఈ ట్రైన్ లో ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.